రంగనాయక సాగర్ లో రాపిడ్ యాక్షన్ పోర్స్.

సిద్ధిపేట:
ఆసియా ఖండంలోనే ఇంత గొప్ప ప్రాజెక్టు ని ఎక్కడ చూడలేదు. ప్రాజెక్టు పనులను సందర్శించిన రాపిడ్ యాక్షన్ పోర్స్. కాళేశ్వరం లో బాగంగా చిన్నకోడూరు మండలం చందలపూర్ వద్ద నిర్మిస్తున్న రంగానాయక సాగర్ ప్రాజెక్టు సొరంగం, రిజర్వాయర్ పనులను దాదాపు 60మంది రాపిడ్ యాక్షన్ పోర్స్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా వారు పంప్ హౌస్ పనులు, సర్జ్ ఫుల్ పనులను జరుగుతున్న పనులను అడిగి తెలుసుకున్నారు.. ఆసియా ఖండంలోనే ఇలాంటి ప్రాజెక్టును చూడలేదు అని..మహారాష్ట్ర , తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు తిరుగినము కానీ ఇలాంటి గొప్ప ప్రాజెక్టు ను చూడలేదు అని వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు… ఇక్కడి ప్రభుత్వం ప్రజల కోసం చేసే గొప్ప పని ఇదే అని.. ఇందుకు కృషి చేస్తున్న మంత్రి హరీష్ రావు గారి పని తీరుకు వారు హ్యాట్సాప్ చెప్పారు… బోరు వేస్తే నీళ్లు పడని ఈ కాలంలో ఈ ప్రాజెక్టుతో బోరు వేసే పని ఉండదు అని వారు అన్నారు. ప్రాజెక్టు పనులు రాపిడ్ యాక్షన్ ల నడుస్తున్నాయని సంతోషం వ్యక్తం చేసారు. రాపిడ్ యాక్షన్ పోర్స్ కి ప్రాజెక్టు పై అక్కడ ఉన్న అధికారులు క్లుప్తంగా వివరించారు..