రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం.

హైదరాబాద్;
ముగ్గురు గర్భిణీ స్త్రీలు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ఆసుపత్రిలో లేని వైద్యులు. ఆసుపత్రి ఆవరణలో బిడ్డకు జన్మనిచ్చిన లావణ్య,, అనే గర్భిణీ స్త్రీ.
మరో గర్భిణీ స్త్రీ పల్లవిని 108, ద్వారా షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు. పురిటి నొప్పులతో బాధపతున్న లలిత అనే మరో గర్భిణీ స్త్రీ. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని కొందుర్గ్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ అసుప్రతికి వచ్చిన గర్భిణీ స్త్రీలు నానా ఇబ్బందులు పడ్డారు ఉదయం కొందుర్గ్ మండలంలోని ముష్టిపల్లి గ్రామానికి చెందిన లలిత, వనంపల్లి గ్రామానికి చెందిన పల్లవి,పర్వతపూర్ గ్రామానికి చెందిన లావణ్య అనే గర్భిణీ స్త్రీలు కొందుర్గ్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు అయితే వైద్యులు మరియు వైద్య సిబ్బంద్ధి అందుబాటులో లేకపోవడంతో ఒక్కరు బిడ్డకు జన్మనిచ్చారు మర్రోక్కారు పురిటి నొప్పులతో బాధపడుతున్నారు మరొక్కరిని షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు .