రవిప్రకాష్ కు సుప్రీమ్ కోర్ట్ లోనూ దక్కని ఊరట.

న్యూ ఢిల్లీ:

రవిప్రకాశ్ కు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది.’అలంద మీడియా’ ఫోర్జరీ కేసులో రవి ప్రకాశ్ విచారణకు హాజరు కావాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.రవి ప్రకాశ్ బెయిల్ పిటిషన్ పై విచారణ పూర్తి చేసిన‌ సుప్రీంకోర్టు.
41 ఏ నోటీసు కింద విచారణకు హాజరు కావాలని రవి ప్రకాష్ కు ఆదేశం.టీవీ 9 మాజీ సీఈఓ రవి ప్రకాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ.రవి ప్రకాశ్ తరపున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు.
హైకోర్టుకే వెళ్లాలని పిటిషనర్ రవి ప్రకాష్ కు సూచన.ముందస్తు బెయిల్ పిటిషన్ పై మెరిట్ ఆధారంగా విచారణ జరపాలని హైకోర్టుకు సుప్రీం కోర్టు ఆదేశం. జూన్ 10 న విచారణ జరిపి ముందస్తు బెయిల్ పై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు ఆదేశం. 41 ఏ నోటీసు కింద విచారణకు హాజరు కావాలని రవి ప్రకాష్ కు ఆదేశం. అరెస్టు చేయాలంటే 48 గంటల ముందు నోటీసు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసిన సుప్రీం ధర్మాసనం.”కంపెనీ నడవకుండా ఇబ్బందులు పెట్టార”ని జస్టిస్ మల్హోత్రా వ్యాఖ్యానించారు.”హై కోర్టు ఈ కేసులో మెరిట్ గురించి మాట్లాడలేదు.
48 గంటలు టైమ్ ఇచ్చి అరెస్ట్ చేయవచ్చు కదా.
మేము ఎలాంటి ఉపశమనం కల్పించం.
ముందస్తు బెయిల్ పిటిషన్ ఇవ్వం.మెరిట్ పై కేసు డిసైడ్ చేయాలని హైకోర్టు ను కోరుతున్నాము. కేసు పరిశీలన చేసి హై కోర్టు రిజెక్ట్ కూడా చేయవచ్చు” అని జస్టిస్ షా అన్నారు.