రామగుండం ఎమ్మెల్యే రాజకీయ సన్యాసం!!

గోదావరిఖని:
రామగుండం ఎంఎల్ఎ సోమారపు సత్యనారాయణ సోమవారం సంచలన ప్రకటన చేశారు. తాను రాజకీయ సన్యాసం స్వీకరిస్తున్నట్టు తెలిపారు. అయితే ఏ పార్టీ లోకి వెళ్లనన్నారు. కొంతమంది అభివృద్ధి ని అడ్డుకుంటున్నందుకు ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది లేదని కూడా స్పష్టం చేశారు. అభివృద్ధికి సహకారం లభించక పోతుండడం మూలంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎం.ఎల్.ఏ.వెల్లడించారు.