రామగుండం పరిసరాల్లో 6 పులులు.ప్రజల్ని అప్రమత్తం చేసిన పోలీసు,అటవీ అధికారులు.

పెద్దపల్లి:
రామగుండం, బసంత్ నగర్ పరిసర ప్రాంతాల్లో పులులు సంచరిస్తున్నట్టు అటవీశాఖ ఉన్నతాధికారులు ధృవీకరించారు. రామగుండం మాల్యాలపల్లిలో ఆరు పెద్దపులులను గుర్తించారు. ఇందులో 2 పిల్లలున్నట్లు చెప్పారు. ఆదివారం రాత్రి రెండు పులులు ‘బుగ్గ’ అటవీ ప్రాంతంలో రోడ్డు దాటుతున్న సమయంలో చూసినట్టుగా ఒక లారీ డ్రైవర్ తమకు సమాచారం ఇచ్చాడని పోలీసు,అటవీశాఖ అధికారులు తెలిపారు.
నూతనంగా నిర్మిస్తున్న NTPC పరిసరాల్లో మరో పులి సంచారాన్ని కూలీలు గమనించి సమాచారం ఇచ్చారని పోలీసులు తెలిపారు.
బుగ్గ , బసంత్ నగర్ IOC పరిసరాల్లో ఉన్న ఆటవిలో ఒంటరిగా తిరగవద్దని పోలీసు, అటవీశాఖ ఉన్నతాధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.పులులపై దాడి చేస్తే చట్ట ప్రకారం శిక్షార్హులు అవుతారని హెచ్చరించారు. పులుల కనిపిస్తే వెంటనే dial 100 కు సమాచారం ఇవ్వాలని కోరారు.