రాహుల్ గాంధీ బంగ్లా ఖాళీ!!

రాహుల్ గాంధీ బంగ్లా ఖాళీ!!

లోక్ సభ సచివాలయం జారీ చేసిన సర్క్యులర్ లో విచిత్రమైన తప్పులు వెలుగు చూశాయి. సోమవారం సెక్రటేరియట్ కొత్తగా ఎన్నికైన ఎంపీలకు ఖాళీ బంగ్లాల జాబితాను విడుదల చేసింది. ఇందులో 12 తుగ్లక్ లేన్ కూడా ఉంది. ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఇది కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అధికారిక నివాసం. ఇందులో ఆయన 2004 నుంచి నివసిస్తున్నారు. లోకసభ సెక్రటేరియట్ తాజాగా రూపొందించిన జాబితాలో రాహుల్ గాంధీ నివాసం ఉంటున్న బంగళా పేరు ఉండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

రాహుల్ గాంధీ మొట్టమొదటిసారి అమేథీ లోక్ సభ స్థానం నుంచి గెలిచినప్పటి నుంచి 12 తుగ్లక్ లేన్ ఆయన నివాసంగా ఉంది. న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ కథనం ప్రకారం ఇటీవల ఎన్నికల్లో గెలిచిన ఎంపీలకు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్న బంగ్లాలు, వాటి చిరునామాలను సచివాలయం జారీ చేసిన సర్క్యులర్ లో ఉన్నట్టు తెలిసింది. రాహుల్ గాంధీ బంగ్లా అతి పెద్దదైన టైప్ 8 కేటగిరీకి చెందినది.

రాహుల్ గాంధీ 2004లో అమేథీ ఎంపీగా ఎన్నికైనప్పటి నుంచి ఆయన తుగ్లక్ లైన్ నివాసంలో ఉంటున్నారు. ఈ సర్క్యులర్ లో కొత్తగా ఎన్నికైన ఎంపీలకు కేటాయించాల్సిన ఆవాసాల పేర్లను పేర్కొనడం జరిగింది. తుగ్లక్ లైన్ లో ఉన్న రాహుల్ గాంధీ నివాసం టైప్ 8 శ్రేణిలోకి వస్తుంది. దీనిని వీవీఐపీలు, కేబినెట్ మంత్రులకు మాత్రమే అర్హత ఉంటుంది. లోక్ సభ ఎన్నికల్లో అమేథీ నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓడిపోయినప్పటికీ ఆయన కేరళలోని వాయనాడ్ సీటు నుంచి భారీ మెజారిటీతో గెలిచారు.

నియమాల ప్రకారం ఖాళీ బంగ్లాల జాబితాను లోక్ సభ సెక్రటేరియట్ కొత్త సభ్యులకు అందజేస్తుంది. దీని నుంచి వాళ్లు తమ బంగ్లాను ఎంచుకుంటారు. కేటాయించాల్సిందిగా కోరతారు. ఇందులో భాగంగా 517 ఆవాసాల జాబితాను తయారు చేశారు. ఈ లిస్ట్ లో రాహుల్ గాంధీ నివాసాన్ని కూడా పేర్కొన్నారు. రాహుల్ గాంధీ కార్యాలయానికి దీనికి సంబంధించిన సమాచారం అందలేదని తెలిసింది.

Rahul Gandhi’s official residence among 517 vacant bungalows to be allotted to newly-elected MPs

India, National, Delhi, New Delhi, Rahul Gandhi, Congress, Lok Sabha, Wayanad, Kerala, Parliament, Secretariat