రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి ఆత్మహత్య.

జవహర్‌నగర్:
మేడ్చల్ జిల్లాలో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి ఆత్మహత్య కలకలం రేపుతోంది. మాదగోని రాములు(55) అనే రిటైర్ ఆర్మీ ఉద్యోగి ఇంట్లో తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. జవహర్‌నగర్ పీఎస్‌ పరిధిలోని ప్రగతి నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.