రేపు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్షించనున్న 35 మంది రచయిత్రుల బృందం.

హైదరాబాద్:
కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు ఓ పర్యాటక కేంద్రంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టును ఇంజనీరింగ్ అధికారులతో పాటు అన్ని వర్గాల వారు ఆసక్తిగా తిలకించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సీడబ్ల్యూసీ సభ్యులు, ఆయా రాష్ట్రాల ఇరిగేషన్ ఇంజనీర్లు, లాయర్లు, జడ్జిలు, ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు, రచయితలు బృందాలుగా వెళ్లి కాళేశ్వరం ప్రాజెక్టు పనులను చూసి వస్తున్నారు. తాజాగా రచయిత్రుల బృందం ఆదివారం కాళేశ్వరాన్ని సందర్షించనుంది. ప్రముఖ రచయిత్రులు జూపాక సుభద్ర, తిరునగరి దేవకీదేవీ, షాజహానా, గోగు శ్యామల, జ్వలిత, పోతన జ్యోతి, మేరీ మాదిగ, నాంపల్లి సుజాత, కొలిపాక శోభారాణి, ఓరుగంటి సరస్వతి, మంద సురేఖ తదితరులు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్షించనున్నారు. ఈ బృందంలో 35 మంది రచయిత్రులు ఉన్నారు. ఆదివారం ఉదయం 5 గంటలకు రవీంద్ర భారతి ప్రాంగణం నుంచి బస్సు బయలుదేరుతుంది. ఈ యాత్రకు మహిళా ఇంజనీర్ రమాదేవి సమన్వయకర్తగా వ్యవహరించనున్నారు.