రేపు ముగ్గురు ఏఐసీసీ కొత్త కార్యదర్శులు హైద్రాబాద్ రాక..

గాంధీభవన్ లో 2 గంటలకు కీలక సమావేశం.
హైదరాబాద్:

ఇటీవలే ఏఐసీసీ కార్యదర్శులుగా నియామకం అయి, తెలంగాణ ఇంచార్జి లుగా బాధ్యతలు తీసుకున్న కేరళకు చెందిన శ్రీనివాసన్ కృష్ణన్ , కర్ణాటకకు చెందిన సలీం అహ్మద్, డి.ఎస్ బోసు రాజులులు సోమవారం హైద్రాబాద్ కు రానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు గాంధీభవన్ లో జరిగే కీలక సమావేశం లో వారు పాల్గొంటారు. ఇంచార్జి ప్రధాన కార్యదర్శి ఆర్ సి కుంతియా, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, కార్య నిర్వాహక అధ్యక్షులు భట్టిలతో పాటు జిల్లా అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొనే ఈ సమావేశం లో పార్టీ భవిష్యత్ కార్యాచరణ, సంస్థాగత పనులు, పార్టీ బూత్ లెవెల్ స్థాయి నుంచి బలోపేతం చేయడం, కమిటీలు పూర్తి చేయడం, శక్తి ప్రోగ్రోమ్ ను పకడ్బందీగా అమలు చేయడం, లాంటి కీలక నిర్ణయాలు, 100 రోజుల పార్టీ ప్రణాళిక తదితర కార్యక్రమలపై చర్చిస్తారు..