రేషన్ డీలర్ల సమ్మె విరమణ.

హైదరాబాద్:
రేషన్ డీలర్లు ముఖ్యమంత్రి కెసిఆర్ పై, రాష్ట్ర ప్రభుత్వంపై సంపూర్ణ విశ్వాసం ప్రకటించారు
అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నట్టే తమకు న్యాయం చేస్తారనే నమ్మకం ఉందని అన్నారు
తమ డిమాండ్స్ అన్ని ఆయన తీరుస్తారని నమ్ముతున్నట్లు ప్రకటించారు.డి.డి లు చెల్లించడానికి నాలుగు రోజుల సమయం కావాలని కోరారు. ఆ అవకాసం ఇస్తే ప్రజలకు ఇబ్బందులు లేకుండా రేషన్ బియ్యం అందిస్తామని హామీ ఇచ్చార.బియ్యం కమీషన్ పెంచాలని డిమాండ్ చేస్తూ రేషన్ డీలర్లు సమ్మెకు దిగారు. అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్న సియం గారు తమకు కూడా న్యాయం చేస్తారని సమ్మెకు దిగిన వారే ముఖ్యమంత్రిపై విశ్వాసం ప్రకటించి సమ్మె విరమించడం చరిత్రాత్మకం. పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్,ఆరోగ్య శాఖమంత్రి లక్ష్మా రెడ్డి, పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి, రేషన్ డీలర్ల గౌరవ అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి రేషన్ డీలర్ల సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళారు. డీలర్లతో మంత్రులు జరిపిన చర్చల్లో రేషన్ డీలర్లు అందరూ ప్రభుత్వం పై పూర్తి విశ్వాసం ప్రకటించారు. ప్రధాన డిమాండ్లు నెరవేరిస్తే చాలు వెంటనే సమ్మె విరమిస్తామని హామీ ఇచ్చారు. తమ భాద్యతలు అన్ని నెరవేర్చేందుకు సిద్దంగా ఉన్నామని మంత్రులకు తమ సంసిద్దత తెలిపారు. డి డి లు కట్టడానికి సమయం ముగియడం తో మరో నాలుగు రోజుల సమయం ఇవ్వాలని కోరారు. వెంటనే సియం గారి దృష్టికి ఈ విషయం తీసుకొని వెళ్ళడంతో ముఖ్యమంత్రి అంగీకరించారు. రాష్ట్రములో అన్ని వర్గాలను అన్ని విధాలుగా ఆదుకుంటున్న కేసీఆర్
సానుకూలం గా స్పందిస్తారని నమ్మకం ఉంది అని డీలర్లు సంఘం నాయకులు నాయకోటి రాజు, బత్తుల రమేష్, దాసరి మల్లేశం అన్నారు. అతి త్వరలోనే తమ డిమాండ్స్ అన్ని నేరవేరుతయనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ నమ్మకంతోనే రేపటినుండి డి డి లు చెల్లిస్తామని ప్రకటించారు.