‘రైతుబంధు’కు ఈ.సి.అనుమతి.

న్యూఢిల్లీ:

తెలంగాణలో రైతుబంధు పథకం పాత పథకమే అని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
పథకం కింద చెక్కుల పంపిణీ చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఎటువంటి అభ్యంతరాలు లేవని తెలిపింది.ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానఅధికారికి కేంద్ర ఎన్నికల కమిషన్ లేఖ రాసింది.