రైతులకు పగటిపూట 9 గంటల కరెంటు!! – వై.ఎస్.జగన్ నిర్ణయం:

amaravathi :

వ్యవసాయానికి గురువారం నుంచి పగటిపూటే తొమ్మిది గంటల విద్యుత్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా విద్యుత్ శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. తాడెపల్లిలోని క్యాంపు కార్యాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో సీఎం బుధవారం సమీక్షించారు. విద్యుత్ సరఫరా పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.వరుస సంచలన నిర్ణయాలతో పాలనలో తనదైన ముద్ర కనబరుస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 60శాతం ఫీడర్లలో పంపుసెట్లకు పగటిపూట ఉచిత విద్యుత్ అమలు చేయాలని ఆదేశించారు. మిగతా 40శాతం ఫీడర్లలో పనులకు రూ.1700 కోట్లు విడుదల చేశారు. ఫీడర్లలో పనులు వేగంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. 2020 జులై 30 నాటికి మిగతా ఫీడర్లలో 9 గంటల విద్యుత్ సరఫరా చేయాలని ఏపీ ముఖ్యమంత్రి ఆదేశించారు.