జడ్చర్ల:
రాష్ట్రావతరణ దినోత్సవం జూన్ 2వ తేదీన రైతుల బీమా పథకాన్ని సీఎం కెసిఆర్ ప్రకటిస్తారని వెల్లడించారు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి. ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలోని ప్రతి రైతుకి బీమా వర్తించే విధంగా కసరత్తు జరుగుతున్నదన్నారు. దేశంలో మొదటి సారిగా చరిత్రాత్మకంగా తెలంగాణలోనే రైతుల బీమా పథకం అమలు కానున్నదని మంత్రి తెలిపారు. జడ్చర్ల నియోజకవర్గంలోని బాలానగర్ మండలం హేమాజీ పూర్, నవాబుపేట మండలం కొల్లూరు, పోమాల్ లలో భూ రికార్డులు పరిశీలించిన వైద్య ఆరోగ్య, కుటుబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి రైతులకు చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో రైతులకు పాసు పుస్తకాలు, పంటల పెట్టుబడుల చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల సభల్లో మంత్రి లక్ష్మారెడ్డి రైతులనుద్దేశించి మాట్లాడారు. గతంలో ఎన్నడూ చరిత్రలో లేని విధంగా రైతులకు భూ రికార్డులను సవరించిన ఘనత సీఎం కెసిఆర్‌దే అన్నారు. పట్టా పాసు పుస్తకాలను సిద్ధం చేసి ఇవ్వడమేగాకుండా, పంటల పెట్టుబడులను ప్రభుత్వమే ఇచ్చే ఒక గొప్ప పద్ధతిని ప్రవేశపెట్టారన్నారు. ప్రతి ఏడాది ఎకరాకు రూ.8వేలు రెండు పంటలకు ఇస్తున్న సీఎం చరిత్రలో చిర స్థాయిగా నిలిచిపోతారన్నారు. రాష్ట్రావతరణ దినోత్సవం జూన్ 2 సందర్భంగా రైతుల పంటల బీమా పథకాన్ని సీఎం ప్రకటిస్తారున్నారు. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం నుంచి బీమా పథకం అమలులోకి వస్తుందని రైతుల హర్ష ధ్వానాల మధ్య మంత్రి ప్రకటించారు. నేరుగా రైతల ఇంటికే అధికారులు వస్తారని చెప్పారు. రైతుల కుటుంబాల వివరాలు, రైతు భూముల వివరాలు, రైతుల నామినీ వంటి వివరాలు సేకరించి, రికార్డు చేసి భద్ర పరుస్తారని మంత్రి తెలిపారు. ప్రతి రైతు ప్రీమియంని కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. రూ.2,500లను ప్రీమియం కింద ప్రభుత్వం రైతాంగానికి చెల్లించను్నందన్నారు. ప్రమాదవ శాత్తు రైతు చనిపోతే, పది రోజుల్లోనే వారి బీమా డబ్బులు వారి ఇంటికి చేరే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నదని మంత్రి వివరించారు. రైతు బీమా పథకం రైతాంగానికి ఎంతో మేలు చేస్తుందని మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. సన్న, చిన్న కారు రైతులకు బీమా పథకం ఉపయోగకరంగా ఉంటుందన్నారు. చిన్న రైతు కష్టాలు వర్ణనాతీతంగా ఉంటాయని, రైతుల కష్టాలు తెలిసిన సీఎం వారి కోసం పంటల పెట్టుబడిలు పెట్టి రైతుని, వ్యవసాయాన్ని, బీమా పథకం ద్వారా రైతుల కుటుంబాలని ఆదుకుంటున్నారని మంత్రి చెప్పారు. రైతుల బీమా పథకం కింద రూ.వెయ్యి కోట్లు సిద్ధం చేసిందని మంత్రి వివరించారు. రైతుల కోసం ఇంతగా చేసిన సీఎం కానీ, ప్రభుత్వం కానీ చరిత్రలో లేదని మంత్రి అన్నారు. రైతుల వివరాలను జాగ్రత్తగా సేకరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పాదర్శకంగా, సమస్యలు లేకుండా, రాకుండా చూసుకోవాలని సూచించారు.
ఇదిలావుండగా, ఆయా గ్రామాల్లో మంత్రి లక్ష్మారెడ్డి రైతులతో ముఖాముఖి మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతుల ఖాతా పుస్తకాలు పరిశీలించారు. లోపాలు గుర్తించి, అక్కడిక్కడే పాసు పుస్తకాల్లో సవరింపులు చేసి, అధికారులతో ప్రొసీడింగ్స్ ఇప్పంచారు. ఆయా రైతుల్లో కొందరికి అక్కడిక్కడే పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. రికార్డుల సవరింపు చేసి, రైతులకు పాసు పుస్తకాలు సక్రమంగా పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. అవకతవకలకు పాల్పడొద్దని, పారద్శకంగా, జాగ్రత్తగా భూ రికార్డులుండాలని ఆర్.ఐ, విఆర్ ఓల ను మంత్రి మందలించారు.ఈ కార్యక్రమాల్లో ఆర్డీఓ లక్ష్మీనారాయణ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.