రోడ్డుప్రమాదంలో కానిస్టేబుల్ దుర్మరణం!!

peddapalli:

ధర్మారం మండలం నంది మేడారం బాలికల గురుకుల విద్యాలయం వద్ద సోమవారం రాత్రి గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో బొడ్డు ప్రణయ్ (26) అనే టి ఎస్ పి కానిస్టేబుల్ మృతి చెందిన విషయం తెలిసిందే .ప్రణయ్ మృతి అనుమానంగా ఉందని టిప్పర్ డీ కొనడం వల్లే మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు మృతదేహాన్ని సంఘటన స్థలంలోనే ఉంచి ఆందోళన కొనసాగిస్తున్నారు. రాత్రి పెద్దపల్లి సీఐ నరేందర్, ధర్మారం ఎస్ ఐ ప్రేమ్ కుమార్ ఎంత నచ్చజెప్పినా వినని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మృతుడు కానిస్టేబుల్ శవం వద్దనే కూర్చుని ఉన్నారు.రాత్రంతా మృత దేహం సంఘటన స్థలం లొనే ఉంది. టిప్పర్ వాహనాన్ని గుర్తించి తమ కుటుంబానికి న్యాయం చేయాలని మృతుడి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు .దీంతో వాహనాలను శాయంపేట మీదుగా గత రాత్రి నుంచి పోలీసులు మళ్లిస్తున్నారు.