రోడ్డు ప్రమాదంలో 5 గురి దుర్మరణం. మంత్రి మహేందర్ రెడ్డి పై దాడికి బాధితుల యత్నం.

 

 

రంగారెడ్డి జిల్లా:
ఇబ్రహీంపట్నం మంచాల మండలం లింగపల్లి లో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం లో ఐదుగురు మరణించారు. ఆటో, కారు ఢీ కొన్న ఘటనతో ప్రమాదం చోటు చేసుకున్నది.
ఈ ప్రమాదం దృశ్యాలు చిత్రీకరిస్తున్న రిపోర్టర్ పై పోలీసులు దాడి చేశారు. మంత్రి మహేందర్ రెడ్డి కారుపై బాధితులు దాడి చేశారు. రాళ్ళ తో దాడికి పూనుకున్నారు. ఆ వీడియో చిత్రీకరిస్తున్న రిపోర్టర్ శ్రీనివాస్ ఫోన్ ను పోలీసులు లాక్కొని పగలగొట్టారు. ఎవ్వరు ఏమి చేస్తారని భూతులు తిట్టారు. లింగపల్లి రోడ్డు ప్రమాద ఘటనా స్థలాన్ని రవాణా మంత్రి మహేందర్ రెడ్డి, ఎంఎల్ఏ కిషన్ రెడ్డి సందర్శించారు. బాదితులను మంత్రి పరామర్శించారు. మృతుల కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబానికి రూ. 3 లక్షల ఎక్స్ గ్రేషియా మంత్రి ప్రకటించారు. సీఎం కేసీఆర్ తో చర్చించి పరిహారం మరింత ఎక్కువ అందేలా చూస్తామన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేలా మహేందర్ రెడ్డి ఆదేశించారు.