న్యూ ఢిల్లీ;
పాకిస్థాన్ రెండు గూఢచర్య ఉపగ్రహాలను ప్రయోగించింది. తన మిత్రదేశం పాకిస్తాన్ కి చెందిన పీఆర్ఎస్ఎస్-1, పాక్టీఈఎస్-1ఏ రెండు ఉపగ్రహాలను చైనా తన జివుకావూన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి లాంగ్‌మార్చ్ 2సి రాకెట్ ద్వారా రోదసిలోకి పంపించింది. పీఆర్ఎస్ఎస్ తో 50 బిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మిస్తున్న చైనా పాకిస్తాన్ ఆర్ధిక కారిడార్ (సీపీఈసీ) నిర్మాణానికి సంబంధించిన సర్వే, విపత్తులు, వ్యవసాయానికి సంబంధించిన పరిశోధనలు, ఆ చుట్టుపక్కల నివాస ప్రాంతాల వివరాలు తెలుస్తాయి. చైనా ఏర్పాటు చేసిన అకాడమీ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ తయారీ అయిన పీఆర్ఎస్ఎస్ ఓ ఆప్టికల్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్. చైనా అంతరిక్ష పరిశోధనాసంస్థ మొదటిసారిగా ఒక విదేశానికి విక్రయించింది. పాక్ టెస్-1ఎను పాక్ అంతరిక్ష పరిశోధనా శాస్త్రవేత్తలు కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. తన సోలార్ ప్యానెళ్లతో పిఆర్‌ఎస్‌ఎస్-1 మంచిపనితీరుతో ఉందని తేలింది. ఏడేళ్ల జీవితకాలంతో ఈ ఉపగ్రహం పనిచేస్తుంది. 60 కిలోమీటర్లపరిధిలో ఉన్న మొత్తం అన్ని అంశాలను కవరేజి ఇస్తుంది. అయితే ఈ రెండిటి వినియోగంతో పాకిస్తాన్ పొరుగుదేశం అయిన భారత్ కార్యకలాపాలపైకూడా నిఘాపెట్టేందుకు అవకాశం ఉంటుంది. పాక్ సరిహద్దుల్లో సైనిక కార్యకలాపాలను మరింతగా శోధించి శతృదేశంపై మరింత కాల్పులకు తెగబడేందుకు వీలవుతుంది. చైనా-పాకిస్తాన్‌లు ఈ రెండు ఉపగ్రహాలను భారత్ పై నిఘా పెంచేందుకే వినియోగించనున్నట్లు తెలుస్తోంది.