లక్ష్యాలకు అనుగుణంగా సాధన.

మహబూబ్ నగర్:
శిక్షణ కాలంలో నేర్చుకున్న అంశాలను నిరంతరం గుర్తు చేసుకుంటూ, కరెంట్ అఫైర్స్ పై శ్రద్ధ పెట్టడం ద్వారా నేర్పరితనం అలవడుతుందని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ అన్నారు. కానిస్టేబుల్ అర్హత పరీక్ష కొరకు ఏర్పాటు చేసిన శిక్షణా శిభిరం ముగింపు కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ శ్రీ డి.రోనాల్డ్ రోస్ ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా మాట్లాడారు.సిలబస్ గురించి ఆందోళన చెందకుండా, మనకు కఠినంగా అనిపించే సబ్జెక్ట్ లో ఉన్న సందేహాలను నివృత్తి చేసుకోవాలని గ్రూప్ డిస్కషన్ వలన విషయాలు మనసులో నాటుకుంటాయని సూచించారు.వేర్వేరు పరీక్షలకు సిద్ధపడేవారు తమ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని పుస్తకాలను ఎంచుకోవాలని సూచించారు. ఎస్.పి.అనురాధ మాట్లాడుతూ పోలీసు ఉద్యోగం శారీరక, మానసిక దృఢత్వానికి పరీక్షగా నిలుస్తుందని వ్రాత పరీక్షతో పాటూ, మైదానంలో ఎదుర్కొనవలసిన క్రీడాంశాల పట్ల పట్టుదలతో కృషి చేయాలన్నారు. మన జిల్లా తరపున శిక్షణ పొందిన యువత అత్యధిక స్థాయిలో ఉద్యోగాలు సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.యువత అడిగిన సందేహాలకు సమాధానాలు ఇచ్చి అధికారులు ప్రోత్సాహం అందించారు.