లారీ బోల్తా. ఇద్దరికి గాయాలు.

యాదాద్రి భువనగిరి:
వేగంగా వెళ్తున్న డిసిఎం వ్యాను అదుపు తప్పి బ్రిడ్జీ పైనుంచి కిందపడిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట మండలం తాళ్లగూడెం స్టేజీ సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. అయితే, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రత్యక్షసాక్షులు చెప్పారు. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు వారిద్దరినీ చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్నపోలీసులు ప్రమాదస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.