లోయలో పడిన బస్సు. 35 మందికి పైగా దుర్మరణం.

డెహ్రాడూన్:
ఉత్తరాఖండ్‌లో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బస్సు లోయలో పడిన దుర్ఘటనలో 35 మందికి పైగా మృతి చెందారు. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. పౌరీ-ఘడ్‌వాల్‌ జిల్లాలోని పిపాలి-బౌనా జాతీయ రహదారిపై నానిదాడా వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనాస్థలం నుంచి 20 మృతదేహాలను ఇప్పటిదాకా వెలికి తీసినట్లు తెలుస్తోంది. గాయపడ్డ మరికొందరిని ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.