లోయలో పడిన బస్సు.7 గురి మృతి.

బెంగళూరు:
తమిళనాడుకు చెందిన బస్సు బోల్తా పడిన ఘటనలో ఏడుగురు మృతి చెందారు. గురువారం కర్ణాటకలోని కూనూరు దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఊటీ నుంచి కూనూరుకు ప్రయాణికులతో వెళ్తున్న తమిళనాడు బస్సు మంతాడ వద్ద అదుపుతప్పి వంద అడుగుల లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఊటీ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు ముమ్మరం చేశారు.