లోయలో పడ్డ లారీ:15 మంది తమిళ కూలీలు మృతి.

చిత్తూరు :
కుప్పం మండలం పెద్దవంక వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కనీసం 15 మంది మృతి చెందారు. కూలీలతో వెళుతున్న లారీ లోయలో పడిపోవడంతో ప్రమాదం జరిగింది.అర్ధరాత్రి వరకు ఏడు మృత దేహాల ను వెలికితీశారు. 15 మంది వరకు మృతి చెంది ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కుప్పం మడలం నాయనూరులో మామిడి కాయల కోత పనులను ముగించుకొని వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు తమిళనాడు వాసులుగా గుర్తించారు.ఈ ప్రమాదంపై సీఎం చంద్రబాబు ద్రిగ్భాంతి ని వ్యక్తం చేశారు.
చిత్తూరు జిల్లా కుప్పం మండలం పెద్ద వంక వద్ద జరిగిన లారీ ప్రమాదంలో పలువురు మృతి చెందడంపై సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారని సి.ఎం.కార్యాలయం తెలిపింది.ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రమాదం వివరాలను తెలుసుకుని తక్షణం సహాయ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్పీని ఆదేశించారు.బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ తగు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.