వచ్చె ఐదేళ్లకు వ్యవసాయ ప్రణాళిక. – చీఫ్ సెక్రెటరీ జోషీ.

హైదరాబాద్:
రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారిగా ఉన్న వ్యవసాయ భూములు, ఉత్పత్తి, ఉత్పాదకత పంటల వారిగా తయారుచేయడంతో పాటు, వచ్చే ఐదేళ్ళలో లక్ష్యాలను విధించుకొని ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి ఆదేశించారు.
గురువారం సచివాలయంలో వ్యవసాయ, సహకార శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్ధసారధి, వ్యవసాయ శాఖ కమీషనర్ జగన్ మోహన్, హార్టికల్చర్ యం.డి వెంకట్రామ్ రెడ్డి, సహకార శాఖ కమీషనర్ వీరబ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. సి.యస్ మాట్లాడుతూ రాష్ట్రంలో 59.67 లక్షల హెక్టార్ల వ్యవసాయ విస్తీర్ణం ఉందని, వచ్చే ఐదేళ్ళలో చేపట్టవలసిన లక్ష్యాలను రూపొందించుకొని పంటల వారిగా వివరాలు, ఉత్పాదకత పెంపు, సేంద్రీయ వ్యవసాయం, నాణ్యమైన విత్తనాలు, యూరియా వినియోగం తగ్గింపు, తదితర అంశాలపై దృష్టిసారించాలన్నారు.సేద్యంలో రైతులకు ఖర్చు తగ్గించడంతో పాటు ఆదాయం పెరిగేలా ప్రణాళికలు ఉండాలన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మైక్రో ఇరిగేషన్ ద్వారా 17.59 లక్షల ఎకరాలు కవర్ అయ్యాయని వచ్చే ఐదేళ్ళ లక్ష్యాన్ని రూపొందించుకోవాలన్నారు. రైతుల ఉత్పత్తులకు Value Addition రావాలన్నారు. రాష్ట్రంలో 55 లక్షల భూసార కార్డులు రైతులకు ఇచ్చామని, రైతుల భూసార పరీక్షల ఫలితాలను విశ్లేషణ చేసి రైతులకు సూచనలు అందించాలని అన్నారు. ఏఈఓలకు భూసారపరీక్షలు, విత్తనాలు, ఎరువులు, మైక్రొఇరిగేషన్ లాంటి రైతులకు సంబంధించిన ప్రతి అంశంపై తగు శిక్షణ ఇవ్వాలన్నారు. ఆర్గానిక్ పంటల సేద్యంపై ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక రూపొందించి రైతులకు పెద్దఎత్తున ప్రోత్సాహం అందివ్వాలన్నారు.ఆయిల్ ఫామ్, సెరికల్చర్ పంటల ప్రోత్సాహానికి సంబంధించి ప్రత్యేక నివేధికను రూపొందించి సమర్పించాలన్నారు. ఉద్యాన శాఖ నర్సరీలలో పండ్ల మొక్కల పెంపకంపై కార్యాచరణ రూపొందించాలన్నారు. గ్రీన్ హౌస్, పాలిహౌస్, డ్రిప్, స్ప్రింక్లర్,కూరగాయలు, పండ్లసాగును దృష్టిలో ఉంచుకోవాలన్నారు.మార్కెటింగ్ కు సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 320 గోడౌన్ల నిర్మాణం పూర్తి చేసి 16 లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం పెంచామని తెలిపారు. నిర్మించిన గోడౌన్లకు అవసరమైన సౌకర్య కల్పనకు ప్రత్యేక దృష్టి సారించాలని సి.యస్ అన్నారు. గోడౌన్లు లేని ప్రాంతాలలో ప్రాధాన్యతలను ఏర్పరచుకొని కొత్తవి నిర్మించాలన్నారు. రైతు బంధు పథకానికి ప్రాచుర్యం తీసుకువచ్చి మార్కెటింగ్ శాఖ ద్వారా మరింత మందికి రుణాలు అందించాలన్న ప్రతి రైతు బజారుల వారిగా టర్నోవర్, ట్రాన్స్ జాక్షన్స్ వివరాలు రూపొందించాలన్నారు. మార్కెటింగ్ శాఖలో E-services అమలుపై నివేధిక సమర్పించాలన్నారు. మార్కెట్లలో ENAM అమలు, సౌకర్యాలు PACS ల పనితీరు, కంప్యూటరీకరణ, ధాన్యసేకరణ తదితర అంశాలపై చర్చించారు.వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పార్ధసారధి వ్యవసాయశాఖ ద్వారా రైతులకు చేపడుతున్న కార్యక్రమాలు , రైతు బంధు, రైతు బీమా, పథకాలపై వివరించారు. ఖరీఫ్ పంటల పరిస్ధితిపై, వివిధ పథకాలపై సి.యస్ కు తెలిపారు.