వర్షపు నీటి సంరక్షణ కు వారంలో ముసాయిదా.

హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్రంలో వర్షపు నీటి సమర్ధ సంరక్షణ, వినియోగానికి వారంలోగా సంబంధించి ముసాయిదా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్ కె.జోషి అధికారులను ఆదేశించారు. కేంద్ర జలవనరుల శాఖ ఆదేశాల మేరకు సోమవారం సచివాలయంలో సి.యస్ అధ్యక్షతన రాష్ట్ర స్ధాయి కమిటి సమావేశమయ్యింది. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీ పార్ధసారధి, మెట్రోవాటర్ బోర్డు యం.డి శ్రీ దానకిషోర్, కాడా కమీషనర్ మల్సూర్, హార్టికల్చర్ కమీషనర్ వెంకట రాంరెడ్డి, అడిషనల్ పిసిసిఎఫ్ లోకేష్ జైస్వాల్ లతో పాటు గ్రామీణాభివృద్ధి, మున్సిపల్, భూగర్భజలవనరుల శాఖాధికారులు తదితరులు పాల్గొన్నారు. వర్షపు నీటి సంరక్షణకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత వివిధ శాఖల ద్వారా చేపట్టిన కార్యక్రమాల వలనే వచ్చిన గుణాత్మక ఫలితాలను నివేధికలో పొందుపరచాలన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు, ఏర్పడిన తరువాత వివిధ పంటల వారిగా ఉత్పత్తి,ఉత్పాదకత, రిజర్వాయర్లలో నీటినిలవ సామర్ధ్యం పెంపు, అటవీ విస్తీర్ణం పెరుగుదల, భూగర్భజలాలు, చెరువుల పరిస్ధితి, Water Retention Capacity, Soil Moisture Conservation తదితర అంశాలపై నివేధిక తయారుచేయాలన్నారు. వచ్చే 2 సంవత్సరాలకు సంబంధించి దీర్ఘకాల, స్వల్పకాలిక ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఇరిగేషన్ కు సంబంధించి మేజర్, మీడియం, మైనర్ ల ద్వారా 62 లక్షల ఎకరాలకు ఇరిగేషన్ పొటెన్షియల్ ను క్రియేట్ చేయటం జరిగిందని, మిషన్ కాకతీయ ద్వారా 17వేల 860 వాటర్ బాడీస్ ను రీస్టోర్ చేసి 12.47 లక్షల ఎకరాల ఆయకట్టును స్ధిరీకరించినట్టు తెలిపారు. 2014 సంవత్సరం తరువాత 211 కోట్ల రూపాయలతో 67 కొత్త చెక్ డ్యాంలు మంజూరు చేశామని, జైకా నిధుల ద్వారా 79 కొత్త ట్యాంకులను నిర్మిస్తున్నామని, వారాబందీ, టేల్ టు హెడ్, మాడ్రనైజేషన్, తదితర కార్యక్రమాల ద్వారా నీటిని సమర్ధవంతంగా వినియోగిస్తున్నామన్నారు. రాష్ట్రంలో డ్రిప్, స్పింక్లర్ ఇరిగేషన్ ను ప్రోత్సహిస్తున్నామని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2.20 లక్షల హెక్టార్లకు మైక్రో ఇరిగేషన్ సౌకర్యాన్ని కల్పించామని, 2018-19 లో 1.18 లక్షల హెక్టార్లకు మైక్రోఇరిగేషన్ సౌకర్యాన్ని కల్పించనున్నట్లు సి.యస్ తెలిపారు. మైక్రో ఇరిగేషన్ ద్వారా పంటలకు వాడే నీటిని ఆదా చేశామని, ఉత్పాదకత పెరిగిందని అధికారులు సి.యస్ కు వివరించారు. గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్లను MGNREGS, IWMP ల ద్వారా (పాంపాడ్స్, పర్కులేషన్ ట్యాంక్స్, కాంటూర్ ట్రెంచర్సు,సోక్ పీట్స్) లాంటి పనులు చేపడుతున్నామన్నారు. భూగర్భజల శాఖ ద్వారా ఇప్పటికే, మిషన్ కాకతీయ పథకం ద్వారా భూగర్భజలాలపై వచ్చిన సానుకూల ప్రభావాన్ని విశ్లేషించామని, పట్టణ ప్రాంతాలలో వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ల నిర్మాణం ద్వారా ఏర్పడిన ప్రభావంపై విశ్లేషించాలన్నారు. మున్సిపాలిటీలలో మంచినీటి సరఫరా, మెరుగుదల పరిస్ధితులను తెలపాలన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా నివేధిక రూపొందించాలన్నారు. వర్షపు నీటిని సమర్ధవంతంగా వాడుకొనే చర్యలు తీసుకోవాలన్నారు.