వాతావరణం ప్రమాదకరంగా వుందని యాత్రికులను హెచ్చరించిన విదేశాంగశాఖ.

ఢిల్లీ:
మానస సరోవర యాత్రికులకు విదేశాంగ శాఖ సూచనలు. యాత్రికులు, రాష్ట్ర ప్రభుత్వాలు, టూర్ ఆపరేటర్లు సూచనలు తప్పనిసరిగా పాటించాలి. హిల్సా, సిమికోట్ లో మౌలికసదుపాయాలు తగినస్ధాయిలో‌ లేవు. సరైన భోజన, వసతి, వైద్య సదుపాయాలు లేవు. యాత్ర ప్రారంభానికి ముందే యాత్రికులు ఆరోగ్యపరీక్షలు చేయించుకోవాలి. నెలకు సరిపడా మందులు వెంట తెచ్చుకోవాలి. హిల్సా, సిమికోట్ కు కేవలం హెలికాప్టర్లు, చిన్న విమానాలే ప్రయాణ సాధనాలు. వాతావరణం బాగుంటేనే ఆపరేషన్స్ ఉంటాయి.చాలా ప్రమాదకరమైన భౌగోళిక వాతావరణం ఉంటుంది. వాతావరణం బాగా లేకుంటే యాత్రికులు అక్కడే ఉండాల్సి వస్తుంది.