వారసుల కోసం కేసీఆర్, డి.ఎస్. పోరు. -రేవంత్ రెడ్డి.

హైదరాబాద్:
నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు వారసుల కోసం తండ్రులు పడుతున్న ఆరాటమని రేవంత్ రెడ్డి బుధవారం చిట్ చాట్ లో అన్నారు. కవిత కోసం కేసీఆర్ తాపత్రయం .. కొడుకుల కోసం డిఎస్ ఆరాటం గా ఆయన వ్యాఖ్యానించారు. ముందస్తు ఎన్నికలు వస్తున్నాయనే కేసీఆర్ కు విజయవాడ లో గుట్టమీద అమ్మవారు, గుట్టకింద కమ్మ వారు గుర్తుకొచ్చారని అన్నారు. కాంగ్రెస్ లో బీసీలకు అవమానాలపై మాట్లాడిన దానం నాగేందర్ ఇప్పుడు డీఎస్ కు జరిగిన అవమానం పై స్పందించాలని రేవంత్ కోరారు.