వాస్తు సుడిగుండంలో తెలుగు ముఖ్యమంత్రులు!!

హైదరాబాద్;
వాస్తు, ముహూర్తాలు, జాతకాల సుడిగుండంలో ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులు కెసిఆర్, చంద్రబాబునాయుడుచిక్కుకున్నారు.ఏ కీలకమైనకార్యక్రమం,లేదా సభలు, సమావేశాలు,నిర్ణయాలు అమలు చేయాలన్నా ఇద్దరూ విధిగా సుమూహుర్తాలనుపాటిస్తున్నారు.చంద్రబాబు నాయుడు కన్నా కేసిఆర్ ఇందులో దిట్ట. వాస్తు నమ్మకాలతో కెసిఆర్ రాష్ట్ర సచివాలయానికే రావడం మానేశారు. తనక్యాంపు కార్యాలయం లోనే ‘ప్రగతి భవన్’ ను నిర్మించుకొని అక్కడినుంచే అధికారిక సమావేశాలు, కార్యక్రమాలు,మంత్రిమండలి సమావేశాలు గత రెండేళ్లుగా నిర్వహిస్తున్నారు. పూజలు,పునస్కారాలు,యాగాలు, హోమాలు తెలంగాణలో విరివిగా జరుగుతుంటాయి.ప్రస్తుత రాజకీయ ప్రముఖుల్లో జాతకాలు, వాస్తు,ముహూర్తాలపై అపార నమ్మకం, వాటిపై పట్టు ఉన్నవారెవరంటే కెసిఆర్అని చిన్న పిల్లవాడైనా చెబుతాడు. అంతలా ఆయనకు ప్రచారం లభించింది.ఆయన అడుగు తీసి, అడుగువేయాలన్నా ఖచ్చితంగా సుమూహూర్తంఉండవలసిందే. పండితులు,జ్యోతిష్యులసలహాలు,సూచనలు లేకుండా ఏ పనీ ప్రారంభించరనేదిజగమెరిగిన సత్యం. వాస్తు బాగా లేదన్నందుకే కొత్త సచివాలయాన్ని సికిందరాబాద్ బైసన్పోలో గ్రౌండ్స్ లో నిర్మించాలని తలపోస్తున్నారు. కేంద్ర రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఈ స్థలానికి ప్రత్యామ్నాయంగా మరో చోట భూమిని రక్షణ శాఖకు కేటాయించాలని కోరామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవలే చెప్పారు. అయితే కొన్ని కేసులు కోర్టులో ఉన్నాయి.అవి తేలిన తర్వాత కొత్త సచివాలయం నిర్మాణానికి పునాదిరాయిపడవచ్చును. బేగంపేటలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కలిసి రావటంలేదంటూ వాస్తు, జ్యోతిష్య పండితులుచెప్పినందున‘వాస్తు దోషరహిత ప్రగతిభవన్’నిర్మితమైంది. పక్కా వాస్తు, అత్యాధునిక సౌకర్యాలతో కెసిఆర్ తన ఆలోచనలకు అనుగుణంగా నిర్మించుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో చంద్రబాబుకు ఇలాంటి విశ్వాసాలుపెద్దగా ఉండేవి కాదు. ఆయన కూడా తాజాగా కెసిఆర్ బాట పట్టారు. ప్రతి పనికి ముందు చంద్రబాబునాయుడు పండితులను సంప్రదిస్తున్నారు.మూడు దశాబ్దాలుగా జూబ్లీహిల్స్ లో ఉంటున్న ఇంటిని కూల్చివేయడంతో పాటు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి కొత్త ఇల్లు నిర్మించుకున్నారు. తెలుగుదేశం పార్టీ హెడ్ క్వార్టర్ ఎన్టీఆర్ ట్రస్టు భవన్ కు కూడా వాస్తుకు అనుగుణంగా పలు మార్పులు, చేర్పులుచేయించారు. ఆంధ్రప్రదేశ్రాజధాని అమరావతిలో నిర్మించిన సచివాలయానికి వాస్తు దోషాలు ఉన్నాయంటే వాటిని సరిదిద్దారు. మార్పులు,చేర్పులకు పూనుకున్నారు. సచివాలయానికి నాలుగు గేట్లు ఉండగా కొత్తగా మరో గేటు ఏర్పాటవుతోంది. అమరావతిలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వాస్తు ప్రకారం నిర్మించారు. క్యాంపుకార్యాలాయానికి ఈశాన్యంలో కృష్ణా నది ఉండేలా డిజైను చేసినందుకు తెలంగాణ సి.ఎం. కెసిఆర్తన విజయవాడ పర్యటనలో చంద్రబాబును అభినందించారంటూ  వార్తలు వచ్చాయి.ఏ.పి.కిప్రత్యెక హోదా కోసం చేపట్టిన ధర్మపోరాట సభలకు కూడా చంద్రబాబు నాయుడు వాస్తుశిల్పుల సలహాలు తీసుకోవడాన్ని బట్టి ఏ.పి.సి.ఎం. వాస్తు, జాతకాలకు ఇస్తున్న ప్రాధాన్యంఅర్ధమవుతున్నది. విశాఖపట్నం,విజయవాడ, తిరుపతిధర్మపోరాట సభల తర్వాత జిల్లాలవారీ సభల కోసం మొదట తూర్పు గోదావరి జిల్లా ను ఎంపిక చేసుకోవడం వెనుక వాస్తు ఉన్నది. తెలంగాణ నుంచి చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని తరలించే ముందు ప్రస్తుత తెలంగాణ సచివాలయంలోని‘ఎల్’ బ్లాకులో ముఖ్యమంత్రి కార్యాలయం ఏర్పాటు అయ్యింది. అంతకుముందు ఆయన ‘హెచ్’ బ్లాకు లో కార్యాలయం ఏర్పాటు చేయాలనుకొని వాస్తు కారణాలతో ‘ఎల్’ బ్లాకు కు మారారు. చంద్రబాబు కార్యాలయం సదుపాయాల  కోసం 20 కోట్లకు పైగా ఖర్చుచేశారు.’నోటుకు ఓటు ‘ కేసు తర్వాత జరిగినపరిణామాలు విజయవాడకు పరిపాలనను వేగంగా తరలించవలసి వచ్చింది. వాస్తు, జాతకాలు, ముహూర్తాలనుమూడ నమ్మకాలుగా కొట్టిపారేసేవాళ్ళు చాలా మందే ఉన్నారు. పాలకులు ఎటువంటి విశ్వాసాలను కలిగి ఉన్నా సామాన్య ప్రజలకు ఇబ్బంది కానంతవరకు సమస్యగా పరిణమించదు. అయితే ప్రజాధనాన్ని వాస్తు,జ్యోతిష్యం వంటి విశ్వాసాల పేరిట వృథ చేస్తే ప్రజలకు జవాబు చెప్పుకోవలసి వస్తుంది.