వాహ్.. మెస్సీ కా చాచా

భారత క్రికెట్ లో మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ లాంటి ఎంటర్ టైనర్ ఉండరు. ఆడిన రోజుల్లో బౌండరీల వరదతో అభిమానులను అలరించిన వీరూ ఇప్పుడు సోషల్ మీడియాలో తనదైన పంచ్ లు విసురుతూ, వీడియోలు పెడుతూ తనకు తానే సాటి అనిపించుకుంటున్నాడు. తాజాగా ప్రపంచాన్ని ఊపేస్తున్న ఫిఫా వరల్డ్ కప్ సందర్భంగా సెహ్వాగ్ ఓ పెద్దాయన ఫుట్ బాల్ విన్యాసాన్ని ట్వీట్ చేశాడు. పెద్దమనిషి అల్లంత దూరాన ఉన్న కిటికీలో నుంచి బంతి దూసుకెళ్లేలా కొట్టిన ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. దానికి వీరేంద్రుడు తనదైన వ్యాఖ్యానం కూడా జోడించాడు. ‘ఫ్రాన్స్, ఇంగ్లాండ్, క్రొయేషియా జట్లను మరిచిపోండి.. ఇతని ఆట చూడండి’ అని రాసి దానికి మెస్సీ కా చాచా అని హ్యాష్ ట్యాగ్ తగిలించాడు.