విత్ ప్యాకేజీ- వితౌట్ ప్యాకేజీ ‘కళంకిత’గా తెలుగు చిత్రపరి‘శ్రమ’

ఈరొంపిలోకి దిగుతున్న నటీమణులు, ప్రముఖ యాంకర్ల సంగతి మాత్రమేటి.వి.చానళ్లు, పత్రికలూమాట్లాడతాయా? విదేశాల్లోని సంపన్న భారతీయ విటులనుఆకర్షించెందుకే కిషన్ దంపతులు ‘సెక్స్ రాకెట్’ నడిపారా? నటీమణులను రప్పించగలిగిన వారే తెలుగు రాష్ట్రాల నుంచి రాజకీయ ప్రముఖులు,వ్యాపార వేత్తలు, ఇతరసంపన్నులను అమెరికాకు పిలిపించలేదనడానికి ఆధారాలు ఉన్నాయా? విటులు ఇక్కడి నుంచి రవాణా కాలేదా? కిషన్ ఇంట్లో దొరికిన డైరీ లో విటుల వివరాలు, వారుఎప్పుడెప్పుడు ఎంత  మొత్తం చెల్లించారు? అనే వివరాలున్నాయని షికాగో దర్యాప్తు సంస్థ అధికారవర్గాలువెల్లడించాయి. పురుషాధిక్య సమాజం అయినందున కేవలం మహిళా నటులు,యాంకర్లను మాత్రమే బట్టబయలుచేస్తారా? చిత్ర పరిశ్రమలో లేదా ఇతర రంగాల్లో ఉన్న ‘విటులను’ బహిర్గతంచేయలేరా?

హైదరాబాద్;
తెలుగు చలనచిత్ర పరిశ్రమ కు ఏమైంది? శ్రీ రెడ్డి ఎపిసోడ్ కు ఇంకా శుభం కార్డు పడనే లేదు. ‘పాకుడురాళ్ళు’ కథలో మరో అంకం ప్రారంభమైంది.
అమెరికా లో ‘చర్మ పరిశ్రమ’ గుట్టురట్టయింది.”అమెరికాలో జరిగే కల్చరల్ ఈవెంట్స్‌లో కొంతమంది నటీమణులని చూపించి, విటులను ఆకర్షించి వ్యాపారం చేసుకోవడం ఇవాళ కొత్తగా జరుగుతున్నదేం కాదు. చాలా కాలంగా జరుగుతున్న తంతే ” అనినటిసంజనఅన్నారు.సాధారణంగా సీ, డీ గ్రేడ్‌కి సంబంధించిన నటీమణులే అటువంటి ఏజెంట్ల వలకు చిక్కుతుంటారు. కొన్ని సందర్భాల్లో ఎక్కువ డబ్బులు ఇచ్చి డ్యాన్స్ పర్‌ఫార్మెన్స్‌లు సైతం చేయించుకుంటుంటారు. ఇంకొన్ని సందర్భాల్లో‘పరస్పర అవగాహన’ ఒప్పందంతోనే ఈ ఊబిలోకి వెళ్తున్న వాళ్లు కూడా లేకపోలేదు అనిసంజన సంచలన వ్యాఖ్యలు చేశారు. బుజ్జిగాడు సినిమాలో నటి త్రిషకు సోదరిగాసంజన పరిచయమైంది. ఆ తర్వాత తెలుగు, కన్నడం, మళయాళం భాషల్లో చెదురుమదురుగా ఆమెకు సినిమా అవకాశాలువస్తున్నాయి. ‘ఇది కేవలం అమెరికాలో జరుగుతున్న బాగోతం ఏమీ కాదు. ఇండియాలో మిగతా రాష్ట్రాలలో సినిమా షూటింగుల సందర్భంగా కూడా ఈ సెక్సు వ్యాపారం సాగుతోంది. అంతెందుకు హైదరాబాద్ లో మాత్రం జరగడం లేదా ?విత్ ప్యాకేజీ, వితౌట్ ప్యాకేజీ పేరిట నటీమణులను బుక్ చేయడం సర్వసాధారణంగా జరుగుతున్నదే.” అని మాధవీలత ఒకటివి చానల్ లో కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. అమెరికాలోప్రదర్శనలు, సమావేశాల పేరిట తెలుగు, కన్నడ సినీ పరిశ్రమలకు చెందిన మహిళా నటులు, కొందరుటివి.యాంకర్లను పిలిపించుకుని అక్కడ డబ్బున్న భారతీయ ధనవంతుల సెక్స్ కోరికలు తీర్చే వ్యాపారం దాదాపునాలుగైదేళ్లుగాసాగుతున్నది. అమెరికా దర్యాప్తు సంస్థలు ఈ సెక్స్ రాకెట్ గుట్టురట్టు చేశాయి . అలా తెలుగు, కన్నడ సినీపరిశ్రమలకు చెందిన ఓ ఐదుగురు నటీమణులు అక్రమంగా షికాగోలో ప్రవేశించి వ్యభిచారంలో చిక్కుకుపోయినట్టు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఈ వ్యవహారంలో అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న హైదరాబాద్‌కి చెందిన కిషన్ మోడుగుమూడి అలియాస్ శ్రీరాజ్ చెన్నుపాటి, అతని భార్య చంద్రకళ పూర్ణిమ మోడుగుమూడి అలియాస్ జయం విభ ప్రధాన నిందితులుగా అధికారులు గుర్తించారు. గత ఏప్రిల్ 28న వాషింగ్టన్‌లో ఆ జంటను పోలీసులు అరెస్ట్ చేసి ఇల్లినాయిస్ కోర్టులో ప్రవేశపెట్టారు. 2017మే 11 నుంచి 2018జనవరి 22 వరకు వీళ్లిద్దరూ‘సెక్స్ రాకెట్’ నేరాలకు పాల్పడ్డారని ఇల్లినాయిస్ కోర్టులో అక్కడి అంతర్గత భద్రత విభాగం అధికారులు దాఖలు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అమెరికాలో ఎక్కడైనా హోటల్ రూమ్స్ బుక్ చేసి నటీమణులని అమెరికాకు పిలిపించుకునే ఈ జంట ఆ తర్వాత పరిస్థితులనుబట్టి వారికి ఆ హోటల్ గదుల్లో కానీ లేదా షికాగోలోని తమ ఇంట్లో కానీ బస ఏర్పాటు చేసే వారు. ఆ తర్వాత ఆ నటీమణులని అమెరికాలో జరిగే తెలుగు, లేదాభారతీయ సమావేశాలకు తీసుకెళ్లి అక్కడే వారిని ‘ఎర’గా చూపిస్తూ ధనవంతులైన విటులను గుర్తించడం ఈ దంపతుల వ్యాపారంలో ఓ భాగమని తేలింది.తెలుగుసినీవర్గాల్లో కలకలం సృష్టించిన షికాగో సెక్స్ రాకెట్‌పై నటి శ్రీరెడ్డి, సంజన, యాంకర్ కమ్ నటి అనసూయ స్పందించారు. అమెరికాలో ఉన్న ఆ మేనేజర్స్ దంపతులు గతంలో తమను కూడా సంప్రదించారని శ్రీరెడ్డి, సంజన, అనసూయ ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధ్రువీకరించారు. టాలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌పై పోరాటం చేస్తూ, పలువురు సినీ ప్రముఖులపై చేసిన ఆరోపణలతో హెడ్‌లైన్స్‌లోకి ఎక్కిన నటి శ్రీరైడ్డి ఈ వివాదంపై స్పందిస్తూ “ఆ అమెరికా దంపతులు తనను కూడా సం‍ప్రందించారు” అని అన్నారు. ‘అవకాశాల్లేనిహీరోయిన్లకు అమెరికాలో ఈవెంట్స్‌, ప్రోగ్రామ్స్ పేరిట ఎర వేసి అక్కడకు రప్పించి, అక్కడే వారిని మభ్యపెట్టి వ్యభిచారంలోకి దింపుతున్నారని శ్రీ రెడ్డి ఆరోపించారు. అలా వెళ్లిన ఆర్టిస్టులకు వాళ్ల వాళ్ల స్థాయిని, వారికి ఉన్న పాపులారిటీనిబట్టి సుమారు 1000 అమెరికా డాలర్ల నుంచి 10,000 డాలర్ల వరకు ఆఫర్‌ చేస్తున్నారని ఆమె స్పష్టంచేశారు. ‘2014లో మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవిశ్రీప్రసాద్‌తో ఓ ఈవెంట్‌కు హాజరయ్యాను. 2016లో అమెరికా నెంబర్‌తో శ్రీరాజ్‌ అనే వ్యక్తి నన్ను సంప్రదించాడు. తెలుగు అసోసియేషన్‌ నిర్వహించే ఓ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా కోరాడు. అయితే, అతడు మాట్లాడే విధానం సరిగ్గా లేదనిపించి అతడి ఆహ్వానాన్ని తిరస్కరించాను. అయినప్పటికీ ఆ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌లో అనసూయ హాజరవుతున్నారు అంటూ నా ఫొటోను ప్రచురించారు. అది గమనించి నేను ఆ ఈవెంట్‌లో పాల్గొనడం లేదని వెంటనే ట్విటర్‌ ద్వారా స్పష్టం చేశాను” అని అనసూయ అప్పట్లో తనకు ఎదురైన అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. నటి మాధవీ లత కథనం ప్రకారం ఈ సంఘటన కొత్తదికాదు. అమెరికాలోనో, మరో దేశంలోనో మాత్రమెజరుగుతున్నదేమీ కాదు.

సినీమాయాజగత్తుభ్రమలో పడి వచ్చి,అవకాశాలు లేక వెనక్కి తిరిగి తమ సొంత ఊళ్లకు వెళ్ళలేక ‘సెక్సురొంపి’లోకి కూరుకుపోవడం సాధారణంగాకనిపిస్తున్నసన్నివేశాలు.ఇదంతా బాగానే ఉంది.తెలిసోతెలియకో, డబ్బుసంపాదనకో,జల్సాలకో, ఈరొంపిలోకి దిగుతున్న నటీమణులు, ప్రముఖ యాంకర్ల సంగతి మాత్రమేటి.వి.చానళ్లు, పత్రికలూమాట్లాడతాయా?విదేశాల్లోని సంపన్న భారతీయ విటులనుఆకర్షించెందుకే కిషన్ దంపతులు ‘సెక్స్ రాకెట్’ నడిపారా? నటీమణులను రప్పించగలిగిన వారే తెలుగు రాష్ట్రాల నుంచి రాజకీయ ప్రముఖులు,వ్యాపార వేత్తలు, ఇతరసంపన్నులను అమెరికాకు పిలిపించలేదనడానికి ఆధారాలు ఉన్నాయా? విటులు ఇక్కడి నుంచి రవాణా కాలేదా?కిషన్ ఇంట్లో దొరికిన డైరీ లో విటుల వివరాలు, వారుఎప్పుడెప్పుడుఎంత మొత్తం చెల్లించారు? అనే వివరాలున్నాయని షికాగో దర్యాప్తు సంస్థ అధికారవర్గాలువెల్లడించాయి.పురుషాధిక్య సమాజం అయినందున కేవలం మహిళా నటులు,యాంకర్లను మాత్రమే బట్టబయలుచేస్తారా? చిత్ర పరిశ్రమలో లేదా ఇతర రంగాల్లో ఉన్న ‘విటులను’ బహిర్గతంచేయలేరా?