విద్యార్థులు సంక్షేమానికి ప్రభుత్వం కృషి.

హైదరాబాద్:
ఈ రోజు కమ్మదనం రెసిడెన్షియల్ స్కూలును వారు పరిశీలించి విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను ఎస్.సి, ఎస్.టి.కమిషన్ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ళ శ్రీనివాస్వి ద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను ఉపయోగించుకొని ఉన్నత స్థాయి విద్య చదువు కొని ఉన్నత స శిఖరాలకు ఎదగాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం హాస్టల్ వంట గదిని పరిశీలించారు. గురుకుల పాఠశాలకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ఎస్సి ఎస్టీ కమిషన్ చైర్మన్ ఏరోళ్ల శ్రీనివాస్,ఎస్సి ఎస్టీ కమిషన్ సభ్యులు ఎం. రాంబాల్ నాయక్, చిలక మర్రి నర్సింహ్మ, బోయుళ్ల విద్యాసాగర్ ను టిఆర్ ఎస్వీ నేత తెలంగాణ మాదిగ స్టూడెంట్ పెడరేషన్ TMSF తాలూక అధ్యక్షుడు జాం గారి రవి,పూలమాల శాలువా తో సన్మానించారు.ఈకార్యక్రమంలో ఆర్డీవో కృష్ణ, ఎమ్మార్వో కె. రామారావు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ విద్యు లత టీఆర్ ఎస్ నాయకులు మాజీ సర్పంచ్ గుర్రంపల్లి కృష్ణయ్య, టీఆర్ ఎస్వీ నేతలు జాం గారి రవి, శ్రీకాంత్, రాజశేఖర్, అశోక్,హన్మంత్, సంజు నాయక్, సతీష్,వివిధ శాఖల అధికారులుపాల్గొన్నారు.