విద్యుత్ శాఖ నిర్లక్ష్యం పసివాడి ప్రాణం మీదకు రాగా కాపాడిన కానిస్టేబుల్.

విజయవాడ:
రంజాన్ తోఫా కోసం తన తల్లి నసీమా తోపాటు ఆరు సంవత్సరాల వయస్సు గల పటాన్ అజ్బల్ జానీ అనే పసివాడు స్థానిక కంచికచెర్ల హనుమాన్ పేట నందు గల రేషన్ దుకాణం వద్దకు రాగా తన తల్లి వేలిముద్రలు వేయడం ఆలస్యమవడంతో ఆడుకుంటూ ప్రక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ వైరును తాకాడు. ట్రాన్స్ఫార్మర్ గోడకు ఆనించి మట్టిని వేయడంతో ట్రాన్స్ఫార్మర్ కు చుట్టూ రక్షణ లేకపోవడంతో పిల్లాడు ఆడుకుంటూ ట్రాన్స్ఫార్మర్ వైరును తాకాడు.కరెంటు షాక్ తో విలవిలలాడుతున్న పిల్లాడిని కాపాడేందుకు ఎవరు ముందుకు రాకపోవడంతో అటుగా వెళ్తున్న కానిస్టేబుల్ సాయిబాబా వెంటనే కర్రతో పిల్లాడిని ట్రాన్స్ఫార్మర్ నుండి వేరుచేయగా మరో కానిస్టేబుల్ స్యామ్ హూటాహుటిన పిల్లాడిని మొసుకుంటూ 108 లోనికి చేర్చి విజయవాడ తరలించారు.స్తానికులు పలుమార్లు విద్యుత్ శాఖఅధికారులకు మొరపెట్టుకున్నప్పటికే వారి నిర్లక్ష్యం కారణంగా ఈరోజు ఒక పిల్లాడు ప్రాణం మీదికి వచ్చింది. విషయం తెలుసుకున్న కంచికచర్ల తాసిల్దార్ పద్మజ, జేసీ బాబూరావు సహాయంతో ఆంద్ర హాస్పిటల్ లో మెరుగైన చికిత్స అందించాలని సూచించారు.