వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి. – పౌర సరఫరాల కమిషనర్.

హైదరాబాద్:
వినియోగదారుల ఫిర్యాదుల కోసం ఇప్పటికే టోల్‌ ఫ్రీ నంబర్‌ ఉండగా, ఇప్పుడు ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ హ్యాండిల్‌ను ఈరోజు ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర సమచార సలహా, సహాయ కేంద్రం వినియోగదారులతో సంభాషణకు, చర్చించడానికి వినియోగాదరుల ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యామ్నాయ వినియోగదారుల వివాదం పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేసింది. వినియోగదారులు ఒక తెల్లకాగితంపై సూచించిన పద్ధతిలో రాసి ఫిర్యాదు చేయవచ్చు. ఇది పూర్తిగా ఉచితం. న్యాయవాదుల ఫీజులు, ఇతరత్రా ఖర్చులు కూడా ఏవీ ఉండవు. అన్నీ సక్రమంగా ఉన్న ఫిర్యాదులను పరిశీలనకు స్వీకరించిన తరువాత… ప్రతివాదుల సంజాయీషికి మూడు వారాల కాలపరిమితి విధిస్తూ నోటిసు జారీ చేస్తారు. కేంద్రంలో ప్రతి శనివారం కౌన్సిలింగ్‌ నిర్వహిస్తారు. వారి సమాధానాన్ని బట్టి – ఇరుపక్షాలను ఒక నిర్ణీత తేదీనాడు వారి కేంద్రానికి పిలిపించి వాది, ప్రతివాదులను నేరుగా వారివారి వాదనలను వినిపించుకునే అవకాశం కల్పిస్తారు. పరిష్కారం కాని కేసులను మూడు కౌన్సెలింగ్‌ల తరువాత జిల్లా వినియోగదారుల ఫోరంలో చట్టబద్ధంగా పరిష్కరించుకోవడానికి సూచించబడతారు. గత నెల రోజుల్లో తూనికల కొలతల శాఖ మల్టిప్లెక్స్‌లు, షాపింగ్‌ మాల్స్‌, విత్తన కంపెనీలు, ఎరువుల కంపెనీలు వివిధ వ్యాపార సంస్థలపై ప్రత్యేక తనిఖీలు జరిపి 600లకు పైగా కేసులు నమోదు చేసి రూ. 12 కోట్లకు పైగా వస్తువులను సీజ్‌ చేసింది.వినియోగదారుల ఫిర్యాదులపై వినియోగదారుల సమచార సలహా, సహాయ కేంద్రం, తూనికల కొలతల శాఖలు కలిసి పనిచేస్తాయి.
వినియోగదారుల సేవా కేంద్రం టోల్‌ ఫ్రీ నెం: 1800 425 00333

ఫేస్‌బుక్‌ : ConsumerInformation RedressalCentre
ట్విట్టర్‌ : Telangana Consumer Info and Redressal Center
వినియోగదారులు తమ ఫిర్యాదులనుwww.consumeradvice.in వెబ్‌సైట్‌లో కూడా నమోదు చేయవచ్చు.

మణికొండ, హైదరాబాదుకు చెందిన లక్ష్మికాంత్‌ భార్య రాజ్య లక్ష్మి మెడ్‌ క్వెస్ట్‌ స్కానింగ్‌ సెంటర్‌ నందు తిఫ్ఫా టెస్ట్‌ ను చేయుంచుకున్నారు. ఐదు నెలలు గర్భస్థ శిశువు వెన్నులో సమస్య ఉన్నా అక్కడి నిర్వాహకులు గుర్తించలేదు. రాజ్య లక్ష్మి ఆడపిల్లను ప్రసవించగా, శిశువుకు వెన్నులో సమస్య ఉన్నట్లు గుర్తించారు. దీనితో బిడ్డను తీసుకొని లక్ష్మికాంత్‌ వైద్యం కొరకు హైదరాబాదులోని పలు హాస్పిటల్స్‌ తిరిగారు. స్కానింగ్‌ సమయంలో నిర్లక్ష్యం వల్ల చిన్నారికి శస్త్ర చికిత్స అవసరమనీ ఇందుకుగాను రూ. 2,00,00 లక్షలు ఖర్చుపెట్టి వైద్యం చేయుంచుకున్నారు. చిన్నారికి మరికొంత కాలం వైద్యం చేయుంచుకోవలసి ఉంటుంది అని డాక్టర్లు చెప్పారు. దీనితో చిన్నారి తల్లితండ్రులు పౌర సరఫరాల శాఖలోని వినియోగదారుల ఫోరంను సంప్రదించగా లిఖితపుర్వక ఫీర్యాదు తీసుకొని విచారణ చేపట్టారు. స్కానింగ్‌ సెంటర్‌ నిర్వహకులు తమ వద్ద పనిచేసిన డాక్టర్‌ నిర్లక్ష్యం కారణం వల్ల చిన్నారికి అయినటువంటి ఖర్చు రూ 2,00,00 లక్షల అపరాధ రుసుము, 5 ఎంఆర్‌ఐ, 5 సిటి స్కాన్లను ఉచితంగా ఇచ్చారు. నష్టపరిహారం కింద స్కానింగ్‌ సెంటర్‌ చెల్లించిన రూ. 2 లక్షల రూపాయల చెక్కును బాధితురాలికి కమిషనర్‌ ఆకున్ సబర్వాల్ అందజేశారు. అంతకు ముందు కొన్నినెలల క్రితం కూడా ఇదే సమస్యతో వచ్చిన ఫిర్యాదును కూడా పరిష్కరించి బాధితులకు రూ. 3 లక్షల నష్టపరిహారాన్ని వినియోగదారుల ఫోరం అందజేసింది.