‘విరసం’ ఆవిర్భవించి 50 ఏళ్ళు!

విప్లవ రచయితల సంఘం చారిత్రక ప్రకటన
జులై 4, 1970; అర్ధరాత్రి 1 గం. 07 ని.లకు:

“సంస్కరణ వాదానికి కాలం చెల్లిపోయింది. సాంస్కృతిక వ్యవహారాల్లో నిస్తబ్దత పేరుకొని వుంది. అభ్యుదయ రచయితల ఉద్యమం కూడ శవప్రాయమైపోయిందీ. ఈ దుస్థితిని తొలగించుకొని జాతిని సమగ్ర విమోచనం వైపు నడిపేందుకు ʹవిప్లవ రచయితల సంఘంʹ ఏర్పడుతున్నది.ఈనాటి దోపిడీ వ్యవస్థతో రాజీలేని వైఖరి, నిజాయితీగల ప్రతి రచయితకు తప్పనిసరి. నిజాన్ని వెల్లడించడంలో రచయితలు భయసంకోచాలను విడిచి ప్రజలకు బాసట కావాలి. తమ కలాలను కత్తులుగా, కాంతులుగా మార్చుకోవాలి. సాంస్కృతిక వికాసానికి అంకితమైన ఈ ʹవిప్లవ రచయితల సంఘంʹ సాహిత్యాన్ని జాతి జీవితంలో ప్రధానాంగం చేయబూనిందీ.
1. మార్క్సియన్ సోషలిజమే మనందరి ధ్యేయం.
2. ప్రజల దీర్ఘ కాలిక విమోచన పోరాటాలను గుర్తించి బలపరచే రచయితలే ఇందులో సభ్యులు.
3. ఏ రూపంలో తిరుగుతున్నా ప్రజల వర్గపోరాటాల నన్నిటినీ మనం సమర్థిస్తాం.
4. సర్వ సమగ్రమైన దేశ స్వాతంత్ర్యం మన లక్ష్యం.
5. వలస, భూస్వామ్య, ధనస్వామ్య ఆవశేషాలనన్నిటినీ తొలగించి, ʹనూతన
ప్రజాస్వామ్యʹ స్థాపనకు తోడ్పడటమే మా ఉద్దేశం.
6. శ్రామిక అంతర్జాతీయత మా వైఖరి.
7. దేశ దేశాల ప్రజల విమోచన పోరాటాలను మేము హృదయ పూర్వకంగా బలపరుస్తాము.

శ్రీ శ్రీ,
4-7-70; 1-07 A.M.

కె.వి. రమణా రెడ్డి
వరవరరావు
జ్వాలాముఖి
రాచకొండ విశ్వనాథశాస్త్రి
నిఖిలేశ్వర్
రంగనాథం
శ్రీపతి
నగ్నముని
ఉమామహేశ్వరరావు
కేశవరావు
శ్రీనివాసరావు
ఎస్. హరిపురుషోత్తమరావు
పినాకపాణి
సి. ప్రసాద్