వివాహేతర సంబంధం. మాజీ విలేకరి అరెస్ట్.

భద్రాద్రి కొత్తగూడెం:
భద్రాచలంలో ఓ యువకుని ఆత్మహత్య కేసులో అతని తల్లి, సోదరుడు ఫిర్యాదు మేరకు చనిపోయిన వ్యక్తి భార్యతో వివాహేతర సంబంధం కలిగిన మాజీ జర్నలిస్ట్ అనిల్ రెడ్డిని భద్రాచలం పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. పెళ్ళయిన యువతిని అనిల్ ట్రాప్ చేసి సంబంధం పెట్టుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ సంగతి తెలిసిన యువతి భర్త ప్రవీణ్ పురుగుమందు తాగి మృతి చెందాడు. ప్రవీణ్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.