విహారం లో విషాదం. సముద్రంలో ముగ్గురు యువకులు గల్లంతు.

విశాఖపట్నం:
విశాఖ జిల్లా పరవాడ మండలం వెన్నెల పాలెం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సముద్ర స్నానానికి వెళ్లిన అయిదుగురు యువకుల్లో ముగ్గురు యువకులు మృత్యువాత పడ్డారు… ఒక యువకుడు గల్లంతు ఒక యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. పదవ తరగతి పూర్వ విద్యార్థులు ముత్యాలమ్మపాళెం సముద్రతీరాన గెట్ టు గథెర్ ఏర్పాటుచేసుకున్నారు… ఇదిలా ఉండగా సాయంత్రం సుమారు 5 గంటల ప్రాంతంలో సముద్ర స్నానానికి వెళ్లిన అయిదుగురు యువకుల్లో మహేష్, నరేష్, రామకృష్ణ , అనే ముగ్గురు యువకులు అలల దాటికి మృత్యువాత పడ్డారు నరసింగరావు అనే మరో యువకుడు గల్లంతయ్యాడు. గల్లంతయిన నరసింగరావు మృతదేహం ఇంకా లభ్యం కాలేదు. ఇప్పటికే ఒడ్డుకు చేరుకున్న మృతదేహాలను గాజువాకలో rk ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు మరణించినట్టు వైద్యులు నిర్థారించారు. మృతదేహాలను అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు.