వేద విద్యకు అధికారిక గుర్తింపు.

న్యూఢిల్లీ:
విద్య కాషాయీకరణ చేస్తోందని కేంద్ర ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలు నిజమయ్యేలా ఉన్నాయి. ఎంతో కాలంగా ప్రత్యేక గురుకుల బోర్డు ఏర్పాటు చేయాలనుకుంటున్న మోడీ ప్రభుత్వం విమర్శలకు జడిసి కొంత వెనక్కి తగ్గింది. కానీ ఇప్పుడు సీబీఎస్ఈకి సమానస్థాయిలో జాతీయ గుర్తింపునిచ్చేలా వేదిక్ ధృవీకరణల కోసం ఒక బోర్డు ఏర్పాటు చేయాలని మానవ వనరుల మంత్రిత్వశాఖ యోచిస్తోంది. పది, 12 తరగతులకు సమానంగా తామిస్తున్న వేద్ భూషణ్, వేద్ విభూషణ్ ఉత్తీర్ణతలను గుర్తించాలని ఉజ్జయినికి చెందిన ‘మహర్షి సాందీపనీ రాష్ట్రీయ వేద విద్య ప్రతిష్ఠాన్‘ చేసిన ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలస్తున్నట్టు తెలుస్తోంది. హెచ్చార్డీ మంత్రిత్వశాఖ కింద స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేసే ప్రతిష్ఠాన్ లో ఐదో తరగతి నుంచి అడ్మిషన్లు ఉంటాయి. ఐదేళ్లు చదివినవారికి వేద్ భూషణ్, ఏడేళ్లు చదివితే వేద్ విభూషణ్ ఉత్తీర్ణతా పత్రాలు ఇస్తారు. గురుకుల్ బోర్డులు ఏర్పాటు చేయాలన్న ఆర్ఎస్ఎస్ ఆలోచనల మేరకే కేంద్రం ఈ ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది.