వైఎస్సార్సీపీ విజయం కోరుకున్న గల్లా జయదేవ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం వైఎస్సార్సీపీ విజయం సాధించాలని కోరుకున్నారు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్. ఎన్నో ఆశలతో రాష్ట్ర ప్రజలు వైసీపీకి 22 సీట్లు కట్టబెట్టారని గల్లా అన్నారు. లోక్ సభలో మాట్లాడుతూ ఇప్పుడు అందరి కళ్లు వైఎస్సార్సీపీపైనే ఉన్నాయని చెప్పారు. మేం సాధించలేనిది వాళ్లు సాధిస్తారని ఆశగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు సాధించడంలో వారు విజయం సాధించాలని కోరుకుంటున్నట్టు గుంటూరు ఎంపీ పేర్కొన్నారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా తన ప్రయత్నాలలో విజయం సాధించాలని గల్లా జయదేవ్ ఆకాంక్షించారు. ఆయన ఇచ్చిన కొత్త నినాదం ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’ అన్ని రాష్ట్రాలు, ప్రాంతాలు, ప్రజలకు సరిసమానంగా అందాలని కోరుకున్నారు.