వైద్యుల నిర్లక్ష్యం. నిండు గర్భిణీ మృతి.

నాగరకర్నూల్:
జిల్లా కేంద్రంలోని సత్యసాయి ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. నిండు గర్భిణీ మృతికి వైద్యుల నిర్లక్ష్యం అని బాధితుల ఆందోళన చెందుతున్నారు. మూడు రోజుల కిందట బిజ్ఞాపల్లి మండలంలోని గుడ్ల నర్వ గ్రామానికి చెందిన పద్మ వైద్యం కోసం నాగరకర్నూల్ లోని సత్యసాయి అనే ప్రవేట్ ఆసుపత్రికి వచ్చారు. ఈమెకు ఇద్దరు కూతుర్లు ఉండగా 3 వ కాన్పుకు వచ్చింది. అయితే రాత్రి పరిస్థితి విషమించటంతో మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించమని కుటుంబీకులకు తెలిపారు. అయితే మార్గ మధ్యలోనే పద్మ చనిపోయింది. దింతో వెంటనే పద్మ శవాన్ని వెనెక్కి తీసుకొని వచ్చి ఆసుపత్రి ముందు ఉంచి డాక్టర్ ల నిర్లక్ష్యం నుంచి చనిపోయిదంటూ తమకు న్యాయం చేయాలని ఆసుపత్రి ముందు బంధువులతో నిరసనకు దిగారు. దింతో కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది. వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. తమకు పదిలక్షలు చెల్లించి తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆసుపత్రి ముందు ధర్నా చేశారు.