శశిథరూర్ కు బెయిల్ మంజూరు.

న్యూఢిల్లీ:
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్‌కు ఊరట లభించింది. ఆయన సతీమణి సునంద పుష్కర్ మృతి కేసులో బెయిల్ దొరికింది. ఢిల్లీ పాటియాలా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. బుధవారం తీర్పును రిజర్వులో పెట్టినకోర్టు గురువారం ఉదయం తీర్పు వెలువరించింది. శశిథరూర్ దేశం విడిచి వెళ్లే అవకాశం ఉందని.. ఈ కేసులో ఢిల్లీ పోలీసుల వాదనలు వినిపించినా.. వాటిని కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో కస్టడీ అవసరం లేదని సిట్ గతంలో తెలిపిన విషయాన్ని కోర్టుకు తెలిపారు శశిథరూర్. వాదనల అనంతరం బెయిల్ మంజూరుపై నిర్ణయం తీసుకుంది న్యాయస్థానం.