శ్రీవారి పాలకమండలిలో జర్నలిస్టు!!

zakeer.sk:

టీటీడి పాలక మండలి చరిత్రలోనే సంచలనం చోటు చేసుకోబోతున్నది.పాలక మండలి సభ్యుడిగా ఒక జర్నలిస్ట్ ను నియమి౦చబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. తొలుత మై హోం రామేశ్వరరావుని తెలంగాణా ప్రభుత్వం సూచించినా ఆయన మీద ఐటి దాడులు జరగడంతో అవినీతి పరుడు అనే ముద్ర ఉంటుంది కాబట్టి జగన్ ఆయన విషయంలో వెనక్కి తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక ఆయనపై ఐటి దాడులు జరగడంతో రామేశ్వరరావు ని ప్రభుత్వం పక్కకు తప్పించిందని తెలుస్తుంది. రామేశ్వరరావు, కరణ్ రెడ్డి, మరికొందరు పారిశ్రామిక వేత్తలు పాలక మండలిలో సభ్యత్వం కోసం ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మారిన తర్వాత పారదర్శకత కోసం ముఖ్యమంత్రి జగన్ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. గత ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అవినీతి పెరిగిపోయిందని విమర్శలు చేసిన ఆయన దేవస్థానం ప్రక్షాళనకు రంగం సిద్దం చేసారు. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డిని నియమించారు. ఇక ఇప్పుడు పాలకమండలి సభ్యుల మీద దృష్టి పెట్టిన ఆయన సభ్యుల్లో ఒకరిగా దరువు వెబ్ సైట్ మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ రెడ్డిని నియమించడం దాదాపుగా ఖరారైంది. గత కొన్ని రోజులుగా కరణ్ ని నియమిస్తారనే ప్రచారం విస్తృతంగా జరిగింది. ఇక జగన్ సర్కార్ ఆ నిర్ణయాన్ని ఇప్పటికే అనధికారికంగా ప్రకటించేసింది. గత కొన్నేళ్ళు గా ఆయన వైసీపీ కోసం సోషల్ మీడియాలో నిస్వార్ధంగా పని చేయడమే కాకుండా చంద్రబాబు సర్కార్ తప్పులను దరువు ద్వారా ప్రజలకు వివరించడంలో ఆయన దాదాపుగా సఫలం అయ్యారు. తెరాస పార్టీకి సంబంధించిన ప్రచారంలో కరణ్ రెడ్డి చాలా కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. ముందు నుంచి కూడా తెరాస పార్టీకి సంబంధించిన ప్రజాకర్షక పథకాలను సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడం, ప్రచారంలో కీలకమైన సోషల్ మీడియా డిజైన్స్, హోర్డింగ్స్ వంటి వాటిని కూడా సమర్ధవంతంగా తయారు చేసి ప్రజలను ఆకట్టుకునే విధంగా రూపొందించడంతో కెసిఆర్ కరణ్ రెడ్డి పేరుని బలంగా ప్రతిపాదించినట్టు తెలుస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి చంద్రబాబు సర్కార్ తీసుకున్న నిర్ణయాలను ఎండగట్టడంలో కరణ్ రెడ్డి నేతృత్వంలోని దరువు.కాం దాదాపుగా విజయవంతం అయింది. దీనితో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బోర్డ్ మెంబర్ విషయంలో కరణ్ పేరుని ఖరారు చేశాయని ఇక అధికారిక ప్రకటన వేలువడటమే తరువాయి అంటున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గానికి చెందిన కరణ్ తెరాస ప్రభుత్వానికి ప్రజల సమస్యలను వివరించడం వాటి పరిష్కారానికి కృషి చేయడం ద్వారా ముఖ్యమంత్రి కెసిఆర్ కి దగ్గరయ్యారు. మైహో౦ రామేశ్వరరావు మీద ఐటి దాడులు జరగడం, పలు రాజకీయ అవినీతి వ్యవహారాల్లో ఆయన పేరు వినిపించడంతో ఆయనను పక్కన పెట్టి కరణ్ రెడ్డిని నియమించే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో చంద్రబాబు సర్కార్ తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలను వివరించడం ద్వారా జగన్ కి ఒక్క అవకాశం ఇస్తే వ్యవస్థలో వచ్చే మార్పులను కూడా ఆయన తన కథనాల ద్వారా ప్రజలకు అర్ధమయ్యే విధంగా మార్పు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. అటు మీడియాని చంద్రబాబు కట్టడి చేయడంతో దరువు ద్వారా వాస్తవాలను ఆయన బయటపెట్టారు. ఎక్కడా కూడా భయపడకుండా వాస్తవాలను నిర్భయంగా బయటపెట్టడం జగన్ ని విశేషంగా ఆకట్టుకుంది. ఇక ప్రచారం సమయంలో కూడా కరణ్ వైకాపాకు అనుకూలంగా చేసిన ప్రచారం సోషల్ మీడియాలో యువతను పార్టీ వైపు మరల్చడంలో విజయవంతం అయ్యారు. చంద్రబాబు తీసుకున్న కొన్ని సంక్షేమ పథకాల నిర్ణయాలు కేవలం ఎన్నికల కోసమే అనే విషయాన్ని ప్రజలకు ఆయన అర్ధమయ్యేలా వివరించడం, పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసే ఉన్నారని ఉదాహరణలతో చెప్పడం ద్వారా జగన్ కి పరోక్షంగా ప్రత్యక్షంగా వివరించడం కూడా వైకాపాకు సహకరించింది. అటు తెలంగాణా లో ఆయన దరువు ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో కెసిఆర్, కేటిఆర్ కూడా కరణ్ పని తీరుని విశేషంగా మెచ్చుకున్నారు. తన టీంలో కేటిఆర్ కరణ్ ని సభ్యుడిగా చేసుకున్నారు అంటే ఆయన పని తీరు ఏ స్థాయిలో అర్ధమవుతుందని కరణ్ వ్యతిరేకులు కూడా అంగీకరించే పరిస్థితి ఉంది. ఇక తెలంగాణ నుంచి కూడా టీటీడీకి ఆదరణ మరింత పెరగాలి, జగన్ అనుకుంటున్న పారదర్శకత రావాల౦టే తెలంగాణా ప్రాంతానికి చెందిన జర్నలిస్ట్ ఉండాలని కెసిఆర్ కేటిఆర్ భావించి జగన్ సూచించడం, ఇక జగన్ కూడా సోషల్ మీడియాలో స్వచ్చందంగా తన కోసం పని చేసింది కరణ్ అని బలంగా నమ్మడంతో టీటీడి పాలమండలి సభ్యుడిగా ఆయన్ను నియమించాలి అని కీలక నిర్ణయం తీసుకున్నారు జగన్. దీనితో కెసిఆర్ కరణ్ రెడ్డిని పాలక మండలి సభ్యుడుగా తీసుకోవాలని కేటిఆర్ ప్రతిపాదించినట్టు తెలుస్తుంది. కెసిఆర్ ఇప్పటికే దీనిపై నిర్ణయం కూడా తీసుకున్నారు. త్వరలోనే జగన్ సర్కార్ కరణ్ రెడ్డిని అధికారికంగా ప్రకటించనుంది. ఇక ఇదిలా ఉంటె అటు వైకాపాలో కొందరు నేతలు కూడా కరణ్ పార్టీ కోసం చేసిన పనిని జగన్ కి వివరించారట. దీనితో ఆయన మరో ఆలోచన లేకుండా అంగీకరించారు. రామేశ్వరరావు మీద ఐటి దాడులు జరగడం, ఇతరుల పేర్లు కేవలం పరిశీలనలో మాత్రమె ఉండటంతో కరణ్ రెడ్డి పేరుని అధికారిక౦గా ప్రకటించే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు. కరణ్ రెడ్డికి రామేశ్వరావు తప్పుకోవడంతో మార్గం సుగుమం అయిందని అంటున్నారు. కరణ్ రెడ్డి మీద అవినీతి ఆరోపణలు లేకపోవడం, పలు ఎన్నికల్లో నిజాయితిగా ఏమీ ఆశించకుండా పని చేసిన అనుభవం ఉండటం, ప్రజా సమస్యల మీద అవగాహన ఉండటంతో ఆయన పేరుని ఖరారు చేసారు. ఇక త్వరలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనుంది. ఇక దీనిపై అధికారిక ప్రకటన రావడమే తరువాయి.. ఇక ఆయన పాలకమండలి సభ్యుడిగా ఎంపిక కావడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జగన్ కష్టాన్ని గుర్తించారని కరణ్ మున్ముందు మరిన్ని పదవులు అందుకోవాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.