శ్రీశైలానికి నిలిచిన నీటి ప్రవాహం.

శ్రీశైలం:
శ్రీశైలం జలాశయానికి నీటి ప్రవాహం పూర్తిగా నిలిచిపోయింది. జూలై 18 నుంచి 15రోజులపాటు నీటి ప్రవాహం కొనసాగగా.. 130 టీఎంసీల నీరు జలాశయంలో చేరింది. శ్రీశైలం డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, నీటినిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా గురువారానికి నీటిమట్టం 873.40అడుగులుగా, నీటి నిల్వ సామర్థ్యం 156.3840 టీఎంసీలుగా నమోదయ్యాయి.