సంక్షేమ పథకాలకు కేసీఆర్ కొత్త నిర్వచనం.

హైదరాబాద్:
సంక్షేమ పథకాలు తెలుగు ప్రజలకు కొత్తమే కాదు.. ఎన్టీఆర్ నుంచి మొదలైన సంక్షేమ రాజ్యం, చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా తమ తమ మార్క్ కొనసాగించారు.. నూతన రాష్ట్రం తెలంగాణ లో సంక్షేమ రాజ్యానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త నిర్వచనం చెప్పారు.. సంక్షేమం, సబ్సిడీ లు పాలకుల బిక్ష కాదు ప్రజల హక్కు గా మార్చేశారు.. అలా 450 కి పైగా పథకాలు తీసుకొచ్చారు.. భావి తరాలకోసం మరిన్ని పథకాలు ప్రవేశపెట్టారు.. అయితే వాటిని పక్కదారి పట్టకుండా నిలువరించడం కూడా కత్తిమీద సాములాంటిదే.. గతంలో ఆయా ప్రభుత్వాలు ఇచ్చిన పుస్తకాలు, యూనిఫామ్స్, ఉచిత సైకిళ్లు, గ్యాస్ కనెక్షన్లు ఒకటి రెండు కాదు అన్నీ పక్కదారి పట్టినవే. అసలు లబ్దిదారుల కంటే అక్రమార్కుల చేతిలోనే ఎక్కువ గా దర్శనిమిచ్చాయి. అలాంటి వ్యవస్థను గాడిలో పెట్టడం లో సీఎం కేసీఆర్ సఫలీకృతం అయినట్టే కనిపిస్తున్నారు. ఒకటి అర కేసులలో తప్ప , ఎక్కడా దుర్వినియోగం అయిన దాఖలాలు తక్కువ.. కేసీఆర్ కిట్స్, గురుకుల యూనిఫామ్స్, కొత్తగ స్కూలు బ్యాగులు , అదీ, ఇదీ కాదు ఏ పథకం లో నైన దుర్వినియోగం , పక్కదారి వ్యవస్థకు కేసీఆర్ కళ్లెం వేయగలిగారు.