‘సంజూ’ సూపర్ హిట్.

ముంబయి;
బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్యాడ్ బాయ్ సంజయ్ దత్ జీవితంలో ఎన్నో నాటకీయ మలుపులు మరెన్నో వివాదాలు ఉన్నాయి. అలాంటి నటుడి గురించి బయోపిక్ నిర్మాణం అనగానే అటు పరిశ్రమలో ఇటు ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి మొదలైంది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా సంజూ విడుదలైంది. ఇందులో దత్ జీవితంలో కీలకమైనవిగా చెప్పుకొనే డ్రగ్స్, మారణాయుధాల కేసు, 1993 ముంబై పేలుళ్ల కేసు వంటి కీలక అధ్యాయాలను చూపించాడు దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ.

సంజూ రివ్యూ: వన్ మ్యాన్, మెనీ లైవ్స్ అనేది సంజూ ఉపశీర్షిక. అందుకు తగ్గట్టుగానే రాజ్ కుమార్ హిరానీ ఈ బయోపిక్ లో దత్ జీవితంలోని నాటకీయ పరిణామాలను వైవిధ్యభరితంగా చూపించాడు. మారణాయుధాల కేసులో సుప్రీంకోర్టు తీర్పు మేరకు పోలీసులకు లొంగిపోబోతున్న సంజయ్ దత్ (రణ్ బీర్ కపూర్) తన బయోగ్రఫీ రాయించుకోవాలని కోరుకోవడంతో ప్రారంభమవుతుంది. ఓ సినిమా రైటర్ రాసింది నచ్చకపోవడంతో అతను ప్రముఖ రచయిత్రి విన్నీ (అనుష్క శర్మ)ని అందుకు ఎంచుకుంటాడు. ఆమెకు తన జీవితంలోని ఎత్తులు, పల్లాలతోపాటు ఎవరికీ తెలియని విషయాలు, చేసిన తప్పులు, ఒప్పుకోళ్లు అన్నిటినీ చెబుతాడు. తన ప్రతి సినిమాలో మాదిరిగానే హిరానీ ‘సంజూ’లో కూడా హాస్యం, డ్రామాని ఎక్కడా తగ్గనివ్వలేదు. సంజయ్ రిలేషన్ షిప్స్, పెళ్లిళ్ల జోలికి వెళ్లకుండా తండ్రి సునీల్ దత్ (పరేష్ రావల్)తో అతనికి ఉన్న బలమైన బంధాన్ని అద్భుతంగా చూపించాడు. వాళ్లిద్దరూ తండ్రీకొడుకులుగా కంటే మంచి స్నేహితులుగా ఎలా మసలే వారో దర్శకుడు మనసుకు హత్తుకునేలా చూపించాడు. దత్ తల్లి నర్గీస్ గా మనీషా కొయిరాలాది చిన్న పాత్ర. కానీ తల్లిదండ్రులు, కొడుకు మధ్య వచ్చే సీన్లు కన్నీళ్లు తెప్పిస్తాయి. సంజయ్ బెస్ట్ ఫ్రెండ్ కమలేష్ గా కీలకపాత్రలో నటించిన విక్కీ కౌశల్ సినిమాలో బలమైన ముద్ర వేస్తాడు. ఇక భార్య మాన్యత (దియా మీర్జా) బాబాను ఎలా మార్చుకొందో చూపించారు కానీ అతని మిగతా పెళ్లిళ్లను ముట్టుకోలేదు. ఇంత పెద్ద కథలో ‘సంజూ’ మొదటి బిడ్డ త్రిశాల ప్రస్తావనే కనిపించదు. ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తిని రేపే ఇలాంటి అంశాలు లేకపోవడం కచ్చితంగా నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. తనలోని చెడుతో సంజయ్ పోరాటాన్ని చూపిన ఫస్ట్ హాఫ్ ఎంతో బిగువుగా సాగుతుంది. ఇక రెండో సగం అంతా అతనిపై కోర్టు కేసులు, నేను ఉగ్రవాదిని కానని అతను మళ్లీ మళ్లీ చెప్పుకోవడం వంటి సంఘటనలతో నింపేశారు. సినిమా కథకు కావాల్సిన మలుపులన్నీ ఉన్న సంజయ్ దత్ జీవితాన్ని హిరానీ ప్రేక్షకులు కనెక్టయ్యే చక్కటి భావోద్వేగాలతో కలగలిపి మెప్పించాడు. కొన్ని చోట్ల సినిమా సాగదీసినట్లు అనిపించినా ఆనాటి సినిమాలు, హిందీ సినిమా పాటలు బోర్ కొట్టనివ్వలేదు.
టైటిల్ రోల్ లో సంజయ్ దత్ గా రణ్ బీర్ కపూర్ మరోసారి అదరగొట్టేశాడు. రణ్ బీర్ డైలాగ్స్, మేనరిజమ్స్, బాడీ లాంగ్వేజ్ అన్నిటిలోనూ సంజూని అచ్చంగా దింపేశాడు. పిచ్చి పట్టినట్టు డాన్సులు చేయడం, డ్రగ్స్ తీసుకున్నపుడు ఎర్రబారిన కళ్లు, అన్నీ కోల్పోయినట్టు బ్లాంక్ గా చూడటం, ఎమోషన్స్ లో వేరియేషన్ ని అద్భుతంగా చూపాడు. ఈ సినిమాకి అతని నటనే మూలస్తంభంగా నిలిచింది. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది విక్కీ కౌశల్. దత్ కష్టసుఖాల్లో వెన్నంటి నిలిచిన ఆప్త మిత్రుడిగా అతని నటన చాలా బాగుంది. ఏఆర్ రెహ్మాన్, రోహన్-రోహన్, విక్రం మోంట్రోజ్ ల సంగీతం మూడ్ ని ఎలివేట్ చేసేలా ఉంది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టాప్ క్లాస్. అందులోనూ ముఖ్యంగా డ్రగ్ ఎడిక్షన్ ఫేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అద్భుతమైన విజువల్స్ తో పాటు ఎమోషన్స్ బాగా క్యాప్చర్ చేశారు.
జీవితంలో ఇన్ని షేడ్స్ ఉన్న ఒక నటుడి గురించి బయోపిక్ తీయడం ఆషామాషీ విషయం కాదు