‘సిమెంట్ కారు’ . సూర్యాపేట టీఆరెస్ కార్యకర్తల సృజన.

నల్లగొండ:
సూర్యాపేట సమీపంలో టేకుమట్ల దగ్గర టీఆరెస్ కార్యకర్తలు, అభిమానులు సిమెంటుతో నిర్మించిన ఆ పార్టీ ఎన్నికల చిహ్నాన్ని మంత్రి జగదీశ్ రెడ్డి సోమవారం ఆవిష్కరించారు.
తెలంగాణలో ఇటువంటి నిర్మాణం మొట్టమొదటిది. దాదాపు లక్ష రూపాయల వ్యయంతో 20 రోజులలో దీన్ని నిర్మించారు.తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల గుర్తు ఇలా సృజనాత్మక రూపం ఇవ్వడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు.