సీఐడీ కస్టడీలోకి ‘ఎంసెట్ ‘ నిందితులు.

హైదరాబాద్:
‘ఎంసెట్’ స్కామ్ నిందితులను సీఐడీ కస్టడీలోకి తీసుకుంది. నాంపల్లి కోర్టు అనుమతి మేరకు శుక్రవారం చైతన్య కళాశాల డీన్ వాసుబాబు, శివనారాయణను ఆరు రోజుల పాటు సీఐడీ కస్టడీలోకి తీసుకుంది. వారిని చంచల్‌గూడ జైలు నుంచి సీఐడీ కార్యాలయానికి తరలించారు. ఎంసెట్ స్కామ్‌లో అసలు సూత్రధారులపై సీఐడీ ఆరా తీయనుంది. కార్పొరేట్ కళాశాల వెనకున్న శక్తుల గుట్టు విప్పే పనిలో సీఐడీ అధికారులు ఉన్నారు. విద్యార్థులు, ఉద్యోగులు నిందితులుగా మారడంతో యాజమాన్యాల పాత్ర ఉంటుందని సీఐడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఎంసెట్ స్కాంలో అరెస్ట్ అయిన శ్రీచైతన్య కాలేజీ డీన్‌ వాసుబాబు, నారాయణ కాలేజీ ఏజెంట్‌ శివనారాయణలను ఆరు రోజులపాటు సీఐడీ కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి 6వ అదనపు మెట్రోపాలిటన్‌ కోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.