సీబీఐ కోర్టుకు జగన్.

హైదరాబాద్‌:
అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ అధినేత జగన్‌ శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకావాలని జగన్‌ను సీబీఐ కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల ప్రకారం జగన్ ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవుతున్నారు. ఈ కేసులో జగన్‌తో పాటుగా వైసీపీ నేత విజయ్‌సాయిరెడ్డి విచారణ ఎదుర్కొంటున్నారు. జగన్ ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం జగన్ పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతోంది. గురువారం వాతావరణం అనుకూలించకపోవడంతో పాదయాత్రకు అంతరాయం కలిగింది. షెడ్యూల్‌ ప్రకారం గురువారం భీమనపల్లి నుంచి అనాతవరం మీదుగా ముమ్మిడివరం నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగించాల్సి ఉంది. అయితే వర్షం వల్ల గురువారం కార్యక్రమాన్ని రద్దుచేశారు. ఉదయం 10 గంటలకు జగన్‌ హైదరాబాద్‌ వెళ్లిపోయారు. తిరిగి 30వ తేదీన భీమనపల్లి నుంచి పాదయాత్ర కొనసాగుతుందని పార్టీ వర్గాలు ప్రకటించాయి.