సూరత్ లో భారీ అగ్నిప్రమాదం, 19 మంది మృతి

సూరత్ లో భారీ అగ్నిప్రమాదం, 19 మంది మృతి

గుజరాత్ లోని సూరత్ పట్టణంలో ఒక భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఒక భవనంలో మంటలు ఎగసిపడటంతో ప్రాణాలు రక్షించుకొనేందుకు చాలా మంది కిందికి దూకేశారు. ఈ ప్రమాదంలో ఒక టీచర్ సహా 15 మంది విద్యార్థులు మరణించినట్టు సమాచారం. ప్రాణాలు కాపాడుకొనేందుకు వీరంతా నాలుగో అంతస్థు నుంచి కిందికి దూకారు. ప్రమాదం సమాచారం తెలియగానే పెద్ద సంఖ్యలో అగ్నిమాపక సిబ్బంది, ఫైరింజన్లు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. భవనానికి అంటుకున్న మంటలు అదుపులోకి వచ్చాయి. ఇప్పటి వరకు ఐదుగురు విద్యార్థుల మృతదేహాలు వెలికితీసినట్టు తెలిసింది.

ప్రాథమిక సమాచారం ప్రకారం సూరత్ లోని సార్థానా ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. భవనంలో రెండో అంతస్థులో ఉన్న ఒక ఇన్ స్టిట్యూట్ లో మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్టు తెలిపారు. ప్రభావిత వ్యక్తులు, కుటుంబాలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక అధికారులకు సూచించారు.

Fire breaks out in a commercial complex in Surat,19 killed