సేవ్ డెమొక్రసీ!!

అసెంబ్లీ ఆవరణలో మహాత్మాగాంధీ, అంబేడ్కర్ విగ్రహాల ఎదుట నిరసన దీక్ష.

Hyderabad:

ప్రజాస్వామ్యాన్ని కాపాడలంటూ CLP నేత భట్టి పిలుపునిచ్చారు.అప్రజాస్వామికంగా వీఎల్పీని విలీనం చేసుకోవడాన్ని నిరసిస్తూ అసీంబ్లీలోని మహాత్మాగాంధీ విగ్రాహం ఎదుట సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నిరసన తెలిపారు. అసెంబ్లీ ఆవరణలో జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నల్ల రిబ్బన్ తో నిరసన తెలపాలని భట్టి విక్రమార్క భావించారు.కానీ అధికారులు అనుమతి నిరాకరించడంతో గేటుకు ఎదురుగా వారి విగ్రహాల ఎదుట నడిరోడ్డుపై కూర్చుని నల్ల రిబ్బన్ కట్టుకుని నిరసన తెలిపారు.