‘స్పా’ పేరిట వ్యభిచారం 8మంది అరెస్టు.

హైదరాబాద్‌:
హైదరాబాద్‌ మహా నగరంలో వ్యభిచార ముఠా గుట్టు రట్టయింది. మసాజ్‌, బ్యుటీషియన్‌ పేర్లతో గుట్టచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో శేరిలింగంపల్లిలోని స్పా సెంటర్లలో మాదాపూర్‌ ఎస్‌వోటీ పోలీసులు బుధవారం తనిఖీలు చేపట్టగా ఈ విషయం బట్టబయలైంది. స్పా పేరిట అసాంఘిక కార్యకలాపాలు కొనసాగిస్తున్న నలుగురు విటులు, యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ కోసం వారిని చందానగర్‌ పోలీసులకు అప్పగించారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.