స్పోర్ట్స్ స్కూలులో ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పూల్. -మంత్రి పద్మారావు.

హైదరాబాద్:
హకీంపేటలో తెలంగాణ స్పొర్ట్స్ స్కూళ్ళో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్విమ్మింగ్ పూల్ ను నిర్మిస్తామని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి పద్మారావు వెల్లడించారు. ఈ మేరకు వెంటనే ప్రతిపాదనలను సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. సోమవారం హకీంపేట్ లోని స్పొర్ట్స్ స్కూల్లో 3 కోట్ల 70 లక్షల వ్యయంతో నిర్మించిన కాంపౌండ్ వాల్ ను, 1 కోటి 80 లక్షల వ్యయంతో ఇండోర్ స్టేడియం ను ప్రారంభించారు మరియు 15 లక్షల విలువైన ట్రాక్ సూట్స్ లను క్రీడాకారులకు అందజేశారు. ఇక్కడ అంతర్జాతీయ స్థాయి స్విమ్మింగ్ పూల్ ను నిర్మిస్తామన్నారు, అవసరమైతే కేంద్ర నుండి నిధులు సేకరిస్తామన్నారు. దీనితో పాటు సింథటిక్ ట్రాక్ నిర్మాణానికి కూడా ప్రతిపాదనలను తయారు చేయిస్తామన్నారు. ఈ క్రీడా పాఠశాలను దేశానికే గర్వకారణంగా నిలబెట్టి తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటలని ఆకాంక్షించారు. మెరుగైన సౌకర్యాలు, పౌష్టికాహారం అందిస్తూ మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దే బాద్యత ఇక్కడి సిబ్బందిపై వుందన్నారు. క్రీడలతో పాటు విద్యల్లో కూడా రాణించాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు పాపారావు, సెక్రెటరీ వెంకటేశం, ఏం.పి. మల్లారెడ్డి, ఎం‌ఎల్‌ఏ సుధీర్ రెడ్డి, సాట్స్ ఛైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఏం.వి. రెడ్డి, సాట్స్ ఏం.డి. దినకర్ బాబు, స్పొర్ట్స్ స్కూల్ ఓ‌ఎస్‌డి డా. నర్సయ్య, మంత్రి ఓ‌ఎస్‌డి డా. రాజేశ్వర్ రావు తదితరులు పాల్గొనన్నారు.