స్వయంపాలనలో బి.సి.ల స్థానమెక్కడ? అభివృద్ధీ…. ఆత్మగౌరవం.

దశాబ్దాలుగా “రెడ్ల” ఇంటి పార్టీ గా కాంగ్రెస్ పై చెరగని ముద్ర ఉన్నది. అందువల్ల ఆ పార్టీ పై బి.సి.లకు అంతగా ఆశలు లేవు. టి.డి.పి. మాత్రమే బి.సి.లకు అండగా నిలిచింది. ప్రతిఫలంగా బి.సి.లు కూడా ‘కృతజ్ఞతాభావంతో’ టిడిపి ని జిల్లాలో ఆదరించారు.ఉవ్వెత్తున ఎగసిపడిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, 2004 లో కాంగ్రెస్ – టిఆర్ఎస్ పొత్తు వల్ల బి.సి.లు కూడ టిడిపి ని తిరస్కరించారు. నీళ్ళు,నిధులు,ఉద్యోగాలు,ఆత్మగౌరవం, నినాదాలవెంట నడచైనా చరిత్ర ఉమ్మడి పాలమూరుకు ఉన్నది. జిల్లాలో ‘నాగం’ తో సహా ‘రెడ్లు’ అంతా కెసిఆర్ ను మహబూబ్ నగర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఓడించాలని ‘కుట్రలు’ చేశారు. కానీ ‘తెలంగాణ వాదనకు’, ఉద్యమానికి చిరునామాగా ఉండిన కేసీఆర్ వైపు బి.సి.లు నిలిచి గెలిపించారు.నిజానికి అప్పటికి మహబూనగర్ జిల్లాలో టిఆర్ఎస్ కు నిర్మాణం లేదు.ఆనాడు జిల్లా లోని రెడ్లంతా వైయస్సార్ వెంట ఉంటే ,కొంతమంది చంద్రబాబు బాబు వెంట నిలబడ్డారు. పేద బి.సి.ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ వర్గాలన్నీ కేసీఆర్ వెంట కదిలాయి.

ఎస్.కె.జకీర్.
ఆత్మ గౌరవం లేని అభివృద్ధి మాకెందుకు? అని బిసిలు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తున్నది. తెలంగాణ స్వరాష్ట్రంలో, స్వయంపాలనలో బి.సి.ల స్థానమెక్కడ? అని వారంటున్నట్టు తెలియవచ్చింది. తెలంగాణ ఉద్యమానికి మూల సిద్దాంతమే ‘స్వయంపాలన’ నినాదం. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ అసంతృప్తి ‘నివురు గప్పిన నిప్పు’ వలె ఉన్నట్టు సమాచారమందుతున్నది. అందరిలాగే రాష్ట్రమొస్తే పాలమూరు బి.సి.జనం కూడ ‘ఆత్మగౌరవం’ తో కూడిన రాజకీయ పరిస్థితులు జిల్లాలో వస్తాయని, స్థానిక ‘పటేళ్ళ’ భూస్వామ్య రాజకీయాలు కనుమరుగవుతాయని అనుకున్నారు. గతంలో ఉమ్మడి పాలమూరు జిల్లా లో బి.సి.లకు రాజకీయంగా తెలుగుదేశం పార్టీ పెద్దపీట వేసిందని రాజకీయ పరిశీలకులు గుర్తు చేస్తున్నారు.
మహబూబ్ నగర్-పి.చంద్రశేఖర్(బి.సి),
జడ్చర్ల- ఎర్రసత్యం(బి.సి),
మక్తల్-ఎల్కోటిఎల్లారెడ్డి(బి.సి),
నారాయణపేట్-సూర్యనారాయణ(వైశ్య),
కల్వకుర్తి-జైపాల్ యాదవ్(బి.సి),
షాద్ నగర్ బక్కనినర్శింలు(ఎస్సీ),
వనపర్తి-బీశ్వ కిష్టయ్య(బి.సి),
అచ్చంపేట్-పి.రాములు(ఎస్సీ),
ఆలంపూర్-కొత్తకోట ప్రకాష్ రెడ్డి,
నాగర్ కర్నూల్-వంగ మోహన్ గౌడ్
కొల్లాపూర్-రంగదాస్(బి.సి),
గద్వాల్-గట్టుభీముడు(బి.సి)

దాదాపు 7నియోజక వర్గాల్లో బి.సి.లు, రెండు చోట్ల ఎస్సీ లు, ఒక చోట వైశ్య ఇలా 10 నియోజక వర్గాల్లో రెడ్డీయేతర శాసన సభ్యులను గెలిపించి ‘సామాజిక న్యాయాని’కి చేయూత నిచ్చారని చెబుతున్నారు. తర్వాత డాక్టర్ నాగం జనార్ధనరెడ్డి, దయాకర్ రెడ్డి వచ్చారు. అయినా బి.సి.లకు తగిన ప్రాధాన్యం దక్కిందన్నా వాదన ఉన్నది. మంత్రి వర్గంలో పి.చంద్ర శేఖర్ (బి.సి), ఎల్లా రెడ్డి (బి.సి), పి.రాములు (ఎస్సీ), జెడ్పీ చైర్మన్ గా వెంకట్రావ్ (బి.సి) లకు అవకాశమిచ్చి బి.సి.లకు ప్రాముఖ్యాన్ని అప్పట్లో టిడిపి నాయకత్వం బహిరంగంగా ప్రదర్శించింది. రాజ్యసభ సభ్యుడుగా రూమాండ్ల రాంచంద్రయ్య (బి.సి)ని డిల్లీకి పంపారని కొందరు గుర్తు చేస్తున్నారు. దశాబ్దాలుగా “రెడ్ల” ఇంటి పార్టీ గా కాంగ్రెస్ పై చెరగని ముద్ర ఉన్నది. అందువల్ల ఆ పార్టీ పై బి.సి.లకు అంతగా ఆశలు లేవు. టి.డి.పి. మాత్రమే బి.సి.లకు అండగా నిలిచింది. ప్రతిఫలంగా బి.సి.లు కూడా ‘కృతజ్ఞతాభావంతో’ టిడిపి ని జిల్లాలో ఆదరించారు.ఉవ్వెత్తున ఎగసిపడిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, 2004 లో కాంగ్రెస్ – టిఆర్ఎస్ పొత్తు వల్ల బి.సి.లు కూడ టిడిపి ని తిరస్కరించారు. నీళ్ళు, నిధులు, ఉద్యోగాలు, ఆత్మగౌరవం, నినాదాలవెంట నడచైనా చరిత్ర ఉమ్మడి పాలమూరుకు ఉన్నది. జిల్లాలో ‘నాగం’ తో సహా ‘రెడ్లు’ అంతా కెసిఆర్ ను మహబూబ్ నగర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఓడించాలని ‘కుట్రలు’ చేశారు. కానీ ‘తెలంగాణ వాదనకు’, ఉద్యమానికి చిరునామాగా ఉండిన కేసీఆర్ వైపు బి.సి.లు నిలిచి గెలిపించారు. నిజానికి అప్పటికి మహబూనగర్ జిల్లాలో టిఆర్ఎస్ కు నిర్మాణం లేదు. ఆనాడు జిల్లా లోని రెడ్లంతా వైయస్సార్ వెంట ఉంటే, కొంతమంది చంద్రబాబు బాబు వెంట నిలబడ్డారు. పేద బి.సి. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలన్నీ కేసీఆర్ వెంట కదిలాయి. జేబులో రుపాయి లేకున్నా జెండాలు మోశారు. అయితే ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం స్వరాష్ట్రంలో, స్వయం పాలనలో పాలమూరు బి.సి.లకు ఒరిగిందేమిటి? అనే అంశం పై చర్చ జరుగుతున్నది. కల్వకుర్తి-కసిరెడ్డి నారాయణరెడ్డి, వనపర్తి-నిరంజన్ రెడ్డి, జడ్చర్ల- లక్ష్మారెడ్డి, దేవరకద్ర- ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మక్తల్-చిట్టెం రాంమ్మోహన్ రెడ్డి, నారాయణపేట్-రాజేందర్ రెడ్డి, కోడంగల్-గుర్నాధరెడ్డి లేదా నరేందర్ రెడ్డి, గద్వాల్-బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, కొల్లాపూర్-జూపల్లి కృష్ణారావు…. అంతా అగ్ర కులాల వారే. ఆలంపూర్ ఎస్సీ నియోజకవర్గంలో కూడా తిర్మల్ రెడ్డి వంటి వ్యక్తులే పెత్తనం సాగిస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్నవి. మహబూబ్ నగర్ లో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ను పార్లమెంటు సభ్యుడు జితేందర్ రెడ్డి తరచూ ఎదో రకంగా ‘ఇరకాటంలో’ పెడుతున్నట్టు టిఆర్ ఎస్ కార్యకర్తలు అంటున్నారు. షాద్ నగర్ శాసనసభ్యుడు అంజయ్య యాదవ్ కు మిథున్ రెడ్డి నుంచి ‘ఇబ్బంధులు’ ఉన్నట్టు విమర్శలు వస్తున్నవి. తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి రాగానే పాలమూరు జిల్లాలో ఈ ముగ్గురిలో ‘కులజాడ్యం’ నిద్రలేచిందన్న ఆరోపణలు వివస్తున్నవి. రెండు మంత్రి పదవులు లక్ష్మారెడ్డి, జూపల్లి కి, ఇంకో క్యాబినెట్ ర్యాంక్ పదవి నిరంజన్ రెడ్డి కి కట్టబెట్టడంతో ముగ్గురు ఒక్కటై అన్ని నియోజకవర్గాల్లో బి.సి.ల ను అణచివేస్తున్నట్టు అధికారపార్టీలో వినవస్తుంది. రిజర్వ్ డు నియోజక వర్గాల్లో కూడా తలో’ రెడ్డి’ అనుచరుడికి పెత్తనమిచ్చి రాజకీయం నడుపుతున్నట్టు తెలుస్తున్నది. ఉమ్మడి పాలమూరులో సాగునీటి వసతి పెంచినట్టు టిఆర్ఎస్ నాయకులు పదే, పదే చెబుతున్నారు. కానీ భూమి లేని నిరుపేద కూలీలు నీటిని ఏమి చేసుకోవాలి? భూములున్నప్పటికీ విత్తనం పైన ‘పెత్తనం’, పండించిన గింజపై మార్కెట్ లో ‘జులుం’ రెడ్ల దే నని బిసిలు చెబుతున్నారు. రాజకీయ ‘నయా పెత్తందారీతనం’ జడలు విప్పి విస్తరిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నవి. ”తెలంగాణ ఉద్యమంలో ఆత్మగౌరవం కోసమే స్వయం పాలనంటే కొన్ని కుటుంభాల ఆత్మ గౌరవం కోసమేనని ఆనాడు అర్ధం కాలే. . ఎందుకంటె మీ మీటింగ్ లకు వచ్చి బాగా చెప్పిండ్రని గప్పుడు చప్పట్లు కొట్టినం కదా..కెసిఆర్ సారు… ఎన్టీఆర్ కంటే ఎక్కువ బి.సి.లను లేవడుతడనుకున్నం. కాని మొన్న ఆఖరికి గద్వాల్ సభ ల కూడ బంగ్లా బంధువునే పొగిడిపాయె..ఎన్నడు జై తెలంగాణ అననోన్ని ఆశీర్వదించమనే.. ఆయన అడిగిండు కోట్లిస్తున్నా ..అని పాఠం లెక్క చదివే..టి.వి లల్ల చూసిన మా ఇంట్ల ఆడొళ్లు కూడ ముక్కున ఏలేసుకున్నరు.. అయ్యో పెద్ద సారు ఏంది అంత గాళ్లనే లేపబట్టిండని. ఇగ గద్వాల వేదిక కింద యాబై వేల మంది ‌బి.సి., ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు చెమటలు కక్కుకుంటా కూసున్నరు. ఒక్కరన్న పటేలమ్మ గాని, రెడ్డి గారు గాని కింద కూసోలే.వేదిక మీద మాత్రం ఆ చివర నుంచి ఈ చివర దాక అంతా వాళ్ళే.. చివరికి విజితారెడ్డి,జక్కా రఘునందన్ రెడ్డి గిట్లా వేరే నియోజవర్గాల చిన్న చిన్న పటేళ్ళు కూడ మైకు బట్టుకొని ఓ అటు కూసోండ్రి.. ఇటు కుసోండ్రని కిందున్నోళ్లని పశువుల్లెక్క అదిలించిరి. పాపం గద్వాల బి.సి.నాయకులు బిక్కమోహం ఏసుకొని కూసున్నరు. ఉమ్మడి జిల్లా బి.సి. నాయకులు సి.ఎం.కెసిఆర్ గారు హెలికాప్టర్ ల హైదరాబాద్ పోగానే రాత్రి ఫోన్ లు చేసుకొని ఏం ఖర్మ పట్టిందిరా నాయన మనకు.. ఉరికి ఉరికి బుడ్డ పదవుల కోసం పార్టీ మారితిమి అని ఒకర్నొకరు వోదార్చుకున్నరట. అంతా పాలమూరు ముగ్గురు మొనగాళ్ల మాయ.యువరాజు దగ్గర బి.సి.,ఎస్సీ నాయకుల మీద చాడీలు చెప్పి జీరోలను చేసి,పటేల్ సాబ్ ల పరపతి మాత్రం పెంచుతున్నారట.పెద్ద సారు బొమ్మ, భీఫాం లేకుండ వీళ్లలో ఒక్కడైన గెలుస్తడా? వీళ్ల మోహాలు చూసి ఎవడైన వోట్లేస్తర? కాని ఆ నియోజకవర్గంలో ఈ పటేల్ లేకుంటే గెలవడం కష్టం.. వీళ్లే తురుంఖాన్ లు.. మిగితోళ్లంత తుస్సుగాళ్ళని సెవులల్ల జోరిగల్లెక ఊదుతున్నారట. మన మంటే తలలు తాకట్టు పెట్టినం..రేపు రేపు మన పిల్లల తలలు కూడ తాకట్టుపెట్టాల్నా?. ఏం ఖర్మ పట్టెర పాలమూరు బిడ్డ! నీకు మళ్లా ముళ్ల కంపల పడితివి.కులాలకు వోట్లు పడుతయా ..అభివ్రృద్ది కి పడుతయ్ అని ఒకాయన వెక్కిరింపు..ఇంకొకాయన ఈ క్రింది కులాలన్ని ఎన్నడు కలవాలె.. నోటుకు వోటు అమ్ముకోకుండ నోరెప్పుడు కట్టేసుకోవాలె ….పటేళ్లదే పెత్తనం పోరా నాయన ఊక నెత్తి దినకు అని ఇంకొకాయన గద్దింపు.. తెలంగాణ ఉద్యమమప్పుడు కూడ గిట్లే ఎక్కిరించిండ్రు..కాని ఊడలు వేళ్లతో సహా పెరికి మర్రి చెట్లు కూల్చేసింది ఈ మట్టి మనుషులే.. కావలంటే టైం పాస్ కాక ఇంట్ల గోళ్లు గిళ్ళుకుంటున్న నిన్నటి రాజాధిరాజులను అడగండి.వాళ్లకు అసెంబ్లీ,సచివాలయం కళ్లు మూసుకుంటే కలల్లోకి వచ్చి బాధపెడుతున్న సంగతులు చెబుతారు.మాకు కాంగ్రెస్ ను నమ్మలేక కొస్కింత జాగిచ్చిన టిడిపి వెంట బోతిమి.స్వరాష్ట్రం కోసం పరాయి రాష్ట్రమోడి పార్టి వొద్దేవద్దని ఊగిపోయి సైకిల్ దిగితిమి.సార్ ..కారులో ఈ మాసిపోయిన బట్టలొల్లకు సీటిస్తడని ఆశపడితిమి..కాని నిన్నటి ఖద్దరు బట్టల బూచొళ్ళే ముందూ, వెనక సీట్లల్ల జోరుగ తిష్టవేసిండ్రు.. రేపు వాళ్ల వారసుల కోసం కూడ ముందే సీట్ల లో దస్తీలేసి పెట్టిండ్రు. బి.సి.ల కడుపుల గడ్డపార పెట్టి గెలికినట్లయితాంది”. అని సగటు పాలమూరు కూలీ అన్న మాట.
ఉమ్మడి పాలమూరు జిల్లాకు ‘పిల్లల మర్రి’ చెట్టు ఒక సంకేతం. ఆ చెట్టు వయస్సు 700 ఏండ్లు దాటినవి. ఊడలు ఎంత దిగినవో, అవి ఎంతగా విస్తరించినవో దగ్గరి నుంచి చూడవలసిందే. ‘రెడ్డి’ భూస్వామ్య సంస్కృతి కూడా అలాగే ఊడలు దిగి విస్తరించింది. లివి.